ప్రస్తుతం ఉంటున్న పరిస్దితుల్లో బీమా అనేది ప్రతి వారికి ముఖ్యమైన అంశంగా చెప్పవచ్చూ. ఇక బీమారంగంలో మంచిపేరు తెచ్చుకోవడమే కాకుండా, బీమా తీసుకునేందుకు దేశ‌వ్యాప్తంగా అంద‌రూ మొగ్గుచూపే కంపెనీ ఎల్ఐసీ. మార్కెట్‌లో జీవిత బీమా సంస్థ‌  వివిధ ర‌కాల పాల‌సీల‌ను ప్ర‌వేశ‌పెట్టింది. కాబట్టి ఏదైనా పాల‌సీని తీసుకునేముందు పాల‌సీలో ఉన్న ర‌కాల గురించి తెలుసుకోవ‌డం ఎంతైనా ముఖ్యం..

 

 

ఇకపోతే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో పాలసీ తీసుకున్న వారికి ఒక అలర్ట్. అదేమంటే  కంపెనీ తన పాలసీలను సవరిస్తోంది. ఎల్ఐసీ పాలసీల్లో పలు మార్పులు డిసెంబర్ 1 నుంచి చోటుచేసుకోబోతున్నాయి. దీంతో మీరు తీసుకున్న పాలసీలో కూడా సవరణలకు అవకాశం ఉండొచ్చు. ఇకపోతే ఈ సంస్ద తన పాలసీలను రీలాంచ్ చేయడంతో పాటు ప్రపోజల్ ఫామ్స్‌ను కూడా సవరించనుంది. ఇన్సూరెన్స్ రెగ్యులేటర్ ఐఆర్‌డీఏఐ నిబంధనలకు అనుగుణంగా ఎల్ఐసీ తన పాలసీలను సవరిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుత ప్రపోజల్ ఫామ్స్‌తో పోలిస్తే.. కొత్త ఫామ్స్ సమగ్రంగా ఉంటాయని తెలుపుతున్నారు.

 

 

ఇకపోతే కొత్త ప్రపోజల్ ఫామ్స్‌ను నాలుగు సెక్షన్లుగా విభజిస్తారు. సెక్షన్ 1లో ప్రపోజర్ వివరాలు ఉంటాయి. సెక్షన్ 2లో ప్రపోజ్డ్ ప్లాన్ వివరాలు చూడొచ్చు. సెక్షన్ 3లో ప్రపోజల్ డీలైల్స్, ఫ్యామిలీ హెల్త్, అలవాట్లు వంటివి ఉంటాయి. సెక్షన్ 4లో ప్రపోజర్ సెల్ఫ్ డిక్లరేషన్ ఉంటుంది. ఇదే కాకుండా సెక్షన్ 1లోని ప్రపోజర్ వివరాల్లో కేవైసీ నిబంధనలు, ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్లు, ట్యాక్స్ వివరాలు వంటివి ఉంటాయి. నామినీ ఐడీలు, పేరు, సంతకం, ఐడీ ప్రూఫ్ వంటి సమాచారం ఉండగా, సెక్షన్‌ 2లో ఇన్సూరెన్స్ ప్లాన్ వివరాలు ఉంటాయి.

 

 

ఇంకా ఏమైనా రైడర్స్ ఉంటే వాటి సమచారం కూడా పొందుపరుస్తారు. జీవన్ అమర్ టర్మ్ ప్లాన్ ఎంచుకుంటే అప్పుడు స్మోకింగ్ అలవాటు కూడా తెలియజేయాల్సి ఉంటుంది. దీని ప్రాతిపదికన బీమా మొత్తం ఆప్షన్ మార్చుకునే వీలుంది. ఇక సెక్షన్ 3లో వివిధ రకాల వ్యాధులపై డైరెక్ట్ ప్రశ్నలు ఉంటాయి.

 

 

హెల్త్ ఇన్సూరెన్స్ ప్రపోజల్ ఫామ్స్ మాదిరిగానే ఈ ప్రశ్నల సరళి ఉంటుంది. పాలసీదారుడికి ఉన్న వ్యాధుల గురించి కూడా తెలియజేయాల్సి ఉంటుంది. డయాబెటిక్, స్ట్రోక్, ఎయిడ్స్, హెచ్‌ఐవీ వంటి పలు వ్యాధుల వివరాలు అడుగుతారు. ఇక డిక్లరేషన్ పార్ట్ విషయానికి వస్తే.. ఇప్పుడు 3 సంతకాలు కాకుండా ఇప్పుడు ప్రపోజర్ 7 చోట్ల సంతకం చేయాల్సి ఉంటుంది.

 

 

అలాగే ఎల్‌ఐసీ ఏజెంట్లు విడిగా కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్‌ను కంపెనీకి అందించాల్సి ఉంటుంది. ఇకపోతే డిసెంబర్ 1 నుంచి కంపెనీ రీలాంచ్ చేసిన ప్లాన్లకు కొత్త ప్రపోజల్ ఫామ్స్‌ను స్వీకరిస్తుంది. కాబట్టి ఎల్ఐసీ పాలసీ దారులు ఈ విషయాన్ని గమనించగలరని సంస్ద ప్రతినిధులు తెలియచేస్తున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: