అరటి పండు వల్ల మనకు ఎలాంటి ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. ఆ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ బి6, విటమిన్ సి, మెగ్నిషియం, కాపర్, మాంగనీస్, ఫైబర్, పొటాషియం ఉంటాయి.  డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి వంటి సమస్యలు తగ్గుతాయి. అరటి పండ్లలో ఉండే విటమిన్ బి9 మన శరీరంలో సెరటోనిన్ లెవల్స్‌ను పెంచుతుంది. దీంతో మానసిక ప్రశాంతత కలుగుతుంది. అరటి పండ్లలో ఉండే పోషకాలు నిద్రలేమి సమస్యను పోగొడతాయి.

 

అయితే ఇన్నీ ప్ర‌యోజ‌నాలు ఉన్న‌ప్ప‌టికీ అంద‌రూ దీన్ని తిన‌కూడ‌దు. కేవ‌లం కొంత మంది మాత్ర‌మే తినాలి. మ‌రి అర‌టి పండును ఏ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు తిన‌కూడ‌దో ఇప్పుడు తెలుసుకుందాం.. మ‌ధుమేహం ఉన్న‌వారు అర‌టి పండ్ల‌ను తింటే వారి ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు త్వ‌ర‌గా పెరుగుతాయి. మ‌ళ్లీ ఆ స్థాయిలు త‌గ్గాలంటే అందుకు లివ‌ర్‌, మూత్ర‌పిండాల‌పై అధిక భారం ప‌డుతుంది. క‌నుక మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులు అర‌టిపండ్ల‌కు దూరంగా ఉండ‌డం మంచిది.

 

అధిక బ‌రువు ఉన్న వారు, స్థూల‌కాయులు అర‌టి పండ్ల‌ను తిన‌కూడ‌దు. తింటే అందులో ఉండే కార్బొహైడ్రేట్లు వారిలో అధికంగా కొవ్వును ఉత్ప‌త్తి చేస్తాయి. దీంతో ఇంకా ఎక్కువ బ‌రువు పెరుగుతారు. అర‌టి పండ్ల‌లో థ‌యామిన్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది మైగ్రేన్ ఉన్న‌వారికి మంచిది కాదు. దీని వ‌ల్ల త‌ల‌నొప్పి ఇంకా ఎక్కువ‌వుతుంది. అలాగే కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అర‌టి పండ్ల‌కు దూరంగా ఉండాలి. ఎందుకంటే అర‌టిపండ్ల‌లో ఉండే పొటాషియం కిడ్నీల‌పై భారం పెంచుతుంది. దీంతో కిడ్నీలు త్వ‌ర‌గా ఎఫెక్ట్ అవుతాయి. సో.. బీ కేర్‌ఫుల్..!

మరింత సమాచారం తెలుసుకోండి: