ప్రస్తుత జీవన శైలితో చాలామంది సెక్స్ జీవితాన్ని అంతగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. శృంగారంలో భాగస్వామిని సంతృప్తి పరిచ గలుగుతున్నామా  లేదా అనే అనుమానం తోనే సెక్స్ లో  పాల్గొంటూ సరైన  అనుభూతిని పొందలేకపోతున్నారు. ప్రస్తుతం ఉన్న ఉరుకులు పరుగుల జీవితంతో ఇది జనాలు ఇంకాస్త ఎక్కువైంది . ప్రస్తుత జీవన శైలితో పురుషుల్లో సెక్స్ కోరికలు తగ్గిపోతుండటమే కాదు... సెక్స్ చేసే సామర్థ్యం కూడా రోజురోజుకూ తగ్గిపోతోంది. తొందరగా అలసిపోవడం లాంటివి జరుగుతుండడంతో తమ శృంగార  భాగస్వామిని సంతృప్తి పరుస్తు న్నామా   లేదా అనే అనుమానాలు రేకెత్తుతుంటాయి . ప్రస్తుత జీవన శైలితో  రోజురోజుకు సెక్స్ సామర్థ్యం  కోల్పోతూ తమ శృంగార జీవితాన్ని సరిగ్గా అనుభావించ  లేకపోతున్నారు. 

 

 

 

 అయితే ఇలాంటి వారి కోసం చిన్న చిట్కా. బాదం పప్పులో  బోలెడు పోషకాలు ఉంటాయనే విషయం అందరికి తెలిసిందే. అయితే బాదం పప్పులో ఉండే పోషకాలు ఎక్కువగా సెక్స్ సామర్థ్యాన్ని పెంపొందించడంలో ఉపయోగపడతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాగా  బాదంపప్పు రోజూ తీసుకోవడం ద్వారా పురుషుల్లో సెక్స్ కోరికలు పెరగడంతోపాటు సెక్స్ సామర్థ్యం కూడా పెరుగుతుందని దానికి తగిన పోషకాలు బాదం పప్పులు దొరుకుతాయని చెబుతున్నారు. అందుకే బాదంపప్పును సూపర్ ఫుడ్ గా కూడా చెబుతుంటారట.  బాదం పప్పు తినడం వల్ల అటు ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు సెక్స్ సామర్థ్యాన్ని కూడా పెంపొందిస్తుందట. 

 

 

 

 బాదం పప్పులో ఉండే మంచి కొలెస్ట్రాల్ గుండెకు ఎంతో మేలు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బాదంపప్పును రోజు తీసుకోవడం ద్వారా గుండెపోటు వచ్చే రిస్కు కూడా తగ్గిపోతుందట. అంతే కాకుండా అధిక బరువు ఉన్నవారికి కూడా బాదంపప్పు చాలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. బాదం పప్పులో ఉండే పీచుపదార్థం బరువు తగ్గడానికి ఉపయోగపడుతుందని చెబుతున్నారు. ఇక షుగర్ పేషెంట్లు కూడా బాదంపప్పును ఎక్కువగా తీసుకుంటే ఫైబర్ బ్లడ్ షుగర్ ను  నియంత్రణలో ఉంచవచ్చు అని చెబుతున్నారు. బాదం పప్పులో ఉండే మెగ్నీషియం కండరాలకు బలం చేకూర్చి మంచి చేస్తుందట. అంతేకాకుండా టెస్టోస్టిరాన్ లాంటి హార్మోన్ ఉత్పత్తిలో కూడా బాదంపప్పు ఉపయోగపడుతుందని పరిశోధనలో తేలిందని  శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అందువల్ల బాదంపప్పును రోజుకు తగిన మోతాదులో తీసుకుంటే సెక్స్ సామర్థ్యం కూడా పెంపొందుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: