శృంగారం అనేది ప్రపంచంలో ప్రతి మనిషికి లేక జీవికి అత్యంతగా సంతృప్తినిచ్చేది. కొంతమంది అంగీకరించినా... అంగీకరించకపోయినా... మానవుల యొక్క అతి ముఖ్యమైన కోరిక ఏంటంటే అది కేవలం సంతృప్తికరమైన సెక్స్ ను పొందడమే. యోగులు, సన్యాసులు తప్ప... శృంగార జీవితాన్ని అందరూ కోరుకుంటారు. కానీ ఎన్ని కోరికలు ఉన్నప్పటికీ... శృంగారంలో కొన్ని వందల భంగిమలు కనిపెట్టినప్పటికీ... చాలా మంది శ్రద్ధలేని బోరింగ్ శృంగారం చేస్తుంటారు. కొంతమందికి పాపం వారి శరీరమే సహకరించదు. ఇలా జరగడానికి మీరు తినే ఆహరం, మీ స్వీయ హానికర అలవాట్లు కారణం కావొచ్చు. ఈ ఆర్టికల్ లో ముఖ్యమైన శృంగార సూత్రాలను కవర్ చేయడానికి సాధ్యమైనంత వరకు మేము ప్రయతిస్తాము.


1. మీ అంగం గట్టిగ.. ఇంకా ఎక్కువ సేపు స్తంభించడానికి ఇలా చేయండి.

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమయంలో..అది త్వరగా మెత్తబడి.. వీర్యం కారిపోవడం జరుగుతుంది. ఒకవేళ మీకు ఇదే తరచుగా జరుగుతూ ఉంటే.. మీరేం బాధపడకండి. ఎందుకంటే ప్రస్తుతం 50 శాతం మంది.. 30 ఏళ్ల వయసుకు పైబడిన వారు ఈ సమస్యతోనే బాధపడుతున్నారు. దీనికి పరిస్కారం ఏంటంటే.... 'కేగెల్ ఎక్సర్సైజ్'..అవును!


కానీ అస్సలు కేగెల్ అంటే ఏంటి? మూత్రాశయం, మూత్రాశయం నుంచి మూత్రం వెలికి వచ్చే మార్గం, ప్రేగు/ఆంత్రము, మీ తొడలకి పొట్టకి మధ్య ఉండే భాగం లోని అవయవాలని మీరు బలపరుచుకోవడానికి చేసే వ్యాయామాన్నే.. 'కేగెల్ ఎక్సర్సైజ్' అంటారు.

అయితే ఇది ఎలా చేయాలి? కొత్త వారికి ఈ వ్యాయామం చేయడం కాస్త కష్టమే. ఇది చేయడానికి మీరు... మూత్రం పోసేటప్పుడు.. ఒకసారి మూత్రాన్ని గట్టిగ కంట్రోల్ చేసుకోండి. అప్పుడు మీ టెస్టికల్స్ కొంచెం పైకి లేస్తాయి... అదే విధంగా మీ మూత్రనాళాన్ని మీరు ఫీల్ కూడా అవుతారు. ఇలా చేయడాన్నే కేగెల్ ఎక్సర్సైజ్ అంటారు. అయితే మీరు ప్రతిసారి మూత్రం పోయాల్సిన అవసరం లేదు.. మూత్రం పోసేటప్పుడు మీరు ఎలా చేశారో... అదేవిధంగా మీకు ఖాళీ సమయం దొరికినప్పుడు... మీ టెస్టికల్స్ పైకి లేచే విధంగా మీ మూత్రనాళంని గట్టిగా కాంట్రాక్ట్/సంకోచింపచేయండి. 5 సెకనుల వరకు అలానే కాంట్రాక్ట్ చేయండి.. తర్వాత వదలండి.

ఇలా రోజుకు మూడుసార్లు... ప్రతి ఒక్క సారి 15-20 రౌండ్స్ చేయండి. కొన్ని రోజుల తర్వాత మీ మూత్రనాళం గట్టిపడి.. మీ అంగం మీకు కావాల్సినంత సేపు స్తంభించే ఉంటుంది. కేగెల్ ఎక్సర్సైజ్ ని అనేక రకాలుగా చేయవచ్చు. కానీ కేగెల్ మరీ ఎక్కువగా చేయడం వల్ల లాభాల కంటే నష్టాలే ఉంటాయి. ఇది గుర్తుంచుకోండి.


2. ఆహార సూత్రాలు

ప్రతిరోజు రెండు పచ్చి వెల్లుల్లి పాయలను మెత్తగా నమిలి తినండి. నిజానికి అంగం స్తంభించడానికి మీ బాడీలోని రక్త సరఫరా పర్ఫెక్ట్ గా ఉండాలి. పచ్చి వెల్లుల్లి పాయలను తినడం వలన.. మీ శరీరంలోని రక్తం అధికంగా సరఫరా అయ్యి.. మీ అంగం గట్టిపడడానికి సహాయపడుతుంది. అంగంలో రక్తం నిండటం వల్లనే అది గట్టిగా స్తంభిస్తుందని అందరికీ తెలుసు కదా!.. రోజుకొక ఆపిల్ తినండి. కుంకుమ పువ్వుని తినండి. అరటిపండ్లు, దానిమ్మపండ్లు, బాదం పప్పు, పుచ్చకాయలు, తేనె, పచ్చి ఉల్లిగడ్డలు ప్రతిరోజు స్వీకరించండి. బ్రహ్మచర్యం చేసే వారు ఉల్లిపాయలను అస్సలు తినరు. ఎందుకంటే.. ఉల్లిపాయలు తింటే... టెస్టోస్టెరోన్ విపరీతంగా పెరిగిపోతుంది. దాంతో కామవాంఛ పెరిగి అంగం తరచుగా స్తంభిస్తూ ఉంటుంది. మీరు బ్రహ్మచర్యం చేయడం లేదు కాబట్టి... ఉల్లిపాయలను హాయిగా తిని.. మీ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.


3. బెడ్ లో పాటించవలసిన సూత్రాలు

బైక్ లో ఉండే పిస్టన్ పైకి కిందకు వేగంగా కదులుతూ ఉంటుంది..అది మీరు ఎప్పుడైనా చూశారా? అలా కాకుండా మీరు మీ భాగస్వామితో శృంగారంలో పాల్గొనేటప్పుడు.. నేరుగా యోగిలోపలకి థ్రస్ట్ చేయకుండా.. ఫోర్ ప్లే ని 20-30 నిమిషాల వరకు చేయండి. స్త్రీలకు యోని శరీరం లోపల ఉంటుంది, ఇక మీరు బయటి నుంచి చూడగలిగే, ఇంకా బట్టలను తాకుతూ ఉండే భాగం ఏంటంటే 'వల్వా' దీన్ని ఆంగ్లంలో 'క్లిటోరిస్' అంటారు. వల్వాకు కొంచెం పైన ఉండే భాగాన్ని క్లిటోరిస్ హుడ్ అంటారు. మీ శృంగార సమయాన్ని ఆసక్తికరంగా మార్చాలంటే.. ఈ భాగాన్ని మీ అంగం చివరితో మసాజ్ చేస్తూ ఉండండి. అదే విధంగా.. థ్రస్ట్ చేసే సమయంలో బైక్ పిస్టన్ లాగా మెకానికల్ గా చేయకండి. చాలా నెమ్మదిగా యోని లోపలి ప్రతి నరాన్ని మీ అంగం తో స్పర్శిస్తూ.. ఆ స్పర్శని అనుభవిస్తూ జి-స్పాట్ ని హిట్(డాగీ స్టైల్ బంగిమలో)చేయండి. మీరు క్లైమాక్స్ లో ఉన్నపుడు డీప్ బ్రీతింగ్ చేస్తూ ఆర్గాసంని వాయిదా వేయండి. లేడీస్ ఫస్టు అంటారు కదా! అందుకే ఆడవాళ్ళకి మొదటగా ఆర్గాసం కలిగించి తృప్తి పరచడం ముఖ్యం..ధ్యానం చేయడం ద్వారా మీరు డీప్ బ్రీతింగ్ ని మెరుగుపరుచుకోవచ్చు. అంతర్జాలంలో ఆర్గాసంని స్లో చేయడానికి ఎన్నో పద్ధతులు గురించి సమాచారం దొరుకుతుంది. హస్త ప్రయోగం చేసే సమయంలో కూడా.. మీ ఆర్గాసంని వాయిదా వేయడం నేర్చుకోండి.

పైనున్న సూత్రాలతో పాటు.. ప్రతిరోజు వ్యాయామం చేయడం, ధ్యానం చేయడం ద్వారా ఈ శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: