పోర్నోగ్రఫీ... దేశంలో రోజురోజుకు పెనుభూతంలా  వ్యాప్తి చెందుతుంది. రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీతో సమాజం కొత్త పుంతలు తొక్కుతుండటం ఏమో  కానీ ఈ పోర్నోగ్రఫీ మాత్రం విపరీతంగా వ్యాప్తి చెందుతుంది. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకూ ఈ పోర్నోగ్రఫీ  బానిసలుగా మారుతున్నారు. అప్పుడప్పుడే బయట ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్న చిన్నారులు చేతిలో సెల్ ఫోన్ పడడంతో ఇతర విషయాలను నేర్చుకోవడం కంటే పోర్నోగ్రఫీ మీదే ఎక్కువ దృష్టి పెడుతున్నారు విద్యార్థులు. దీంతో తెలిసీ తెలియని వయసులోనే పోర్నోగ్రఫీ బానిసలుగా మారిపోయి ఉన్మాదులగా  తయారవుతున్నారు.పోర్న్  వీడియోలో చూపించినట్లు తాము చేయాలనీ  కోరికలతో  తెలియని వయసులోనే రగిలిపోతుండటం తో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు.

 


 పోర్నోగ్రఫీ ప్రభావంతోనే దేశంలో రోజురోజుకీ మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. పోర్నోగ్రఫీ బానిసలైన జనాలు కనీసం ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా  అర్థం చేసుకోలేనంత ప్రభావితులవుతున్నారు . ఎలాంటి సర్వేలు  నిర్వహించిన రోజురోజుకు పోర్నోగ్రఫీ పెరిగిపోతుందనే  వెల్లడవుతోంది. అంతేకాకుండా ఈ మధ్య ఎక్కువగా చదువుకునే విద్యార్థులు హాస్టల్ లో ఉండటమే  కాకుండా తల్లిదండ్రులు తమ పిల్లలపై తగిన శ్రద్ధ చూపకపోవడంతో... తెలిసీ తెలియని వయసులోనే పోర్నోగ్రఫీ వైపు అడుగులు వేస్తున్నారు. పోర్నోగ్రఫీ కి బానిసలైపోయి   నెలలు నిండని పసికందు నుంచి పండు ముసలి వరకు అందరిని కామంతోనే చూసే  పరిస్థితి ఏర్పడుతుంది. 

 

 కాగా  పోర్నోగ్రఫీ ప్రభావం దేశంలో ఎక్కడో ఒకచోట ప్రతిరోజు తెరమీదికి వస్తూనే ఉంది. పోర్నో  గ్రఫీ బానిసలై తాము మనుషులం అనేది మరచి జంతువుల్లా  మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అయితే ప్రభుత్వం పోర్నోగ్రఫీ ని బ్యాన్  చేసినప్పటికీ కూడా పోర్నోగ్రఫి  ప్రభావం ఎక్కడ తగ్గలేదు. ఏదో విధంగా పోర్న్ వీడియో లను సంపాదించడం వాటిని చూస్తూ  కామపు మత్తులో  తూగడం. పోర్నోగ్రఫీ ప్రభావంతో ఉన్మాదులగా  మారుతున్న యువతతో ఎంతో మంది చిన్నారులు ఇంకెంతో మంది యువతులు మరెంతో  మంది వృద్ధులు కూడా ప్రాణాలు కోల్పోతున్నారు . అర చేతిలో స్మార్ట్ ఫోన్ అతి తక్కువ ధరకే డేటా ఆఫర్లు... ఇంకేంటి యువత అంతా సోషల్ మీడియాలో తమ చదువుకునే సబ్జెక్టుల గురించి వెతకడం మానేసి పోర్న్ వీడియోల కోసం వెతుకుతున్నారు. దేశవ్యాప్తంగా పోర్నోగ్రఫీ రోజురోజుకు పెరిగిపోతుండటం  నిజంగా బాధాకరం.

మరింత సమాచారం తెలుసుకోండి: