ఒకప్పటితో పోలిస్తే నేటి కాలంలో డిజిటల్ మాధ్యమాల వినియోగం విపరీతంగా పెరిగింది. ఇక చిన్న, పెద్ద అని తేడా లేకుండా చాలా మంది దగ్గర మొబైల్స్ ఫోన్ లు ఉండడం, దానితో పాటు ఇంటర్నెట్ ధరలు కూడా సామాన్యుడికి సైతం ఎంతో అందుబాటులోకి రావడంతో పలు రకాల సోషల్ మీడియా మాధ్యమాల వాడకంతో పాటు సమాజంలో పోర్నోగ్రఫీకి రానురాను అలవాటుపడుతున్న వారు మరింతగా పెరుగుతున్నారు. ఇక మరికొందరు తల్లితండ్రులు అయితే, తమ పిల్లల భద్రత రీత్యా వారికి చిన్నవయసు నుండే సెల్ ఫోన్స్ అందిస్తుండడంతో, 

 

అవే వారి పాలిటి శాపాలుగా మారుతున్నాయి. తెలిసీ తెలియని వయసులో ఆ మొబైల్ ఫోన్ ద్వారా ఏవేవో కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఉత్సుకతతో కొందరు చిన్నారులు పోర్న్ సైట్స్ ఓపెన్ చేసి చూడడం, దానితో వారి ఆలోచనలు చదువుపై కాక అటువంటి తప్పుడు వాటి బాట పట్టడం జరుగుతుంది. దాని వలన చిన్నవయసులోనే శృంగార వ్యామోహంతో తప్పులు చేస్తూ తమ జీవితాలను ఛిద్రం చేసుకుంటున్నారు. ఇక దీనివల్ల సమాజంలో ముఖ్యంగా మహిళలకు భద్రత కరువయింది. తన, పర, వయో బేధం వంటివి మరిచి కొందరు మృగాళ్లు ఆడపిల్లలపై పైశాచికంగా అత్యాచారాలకు, లైంగిక వేధింపులకు దిగడం వంటి అకృత్యాలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వాలు కూడా తమ వంతుగా కొన్ని పోర్న్ సైట్స్ ని ఎప్పటికప్పుడు బ్యాన్ చేస్తున్నప్పటికీ, 

 

మళ్ళి అవి ఏదో ఒక విధంగా యుఆర్ యెల్స్ మార్చుకుని అవి దర్శనం ఇస్తున్నాయి. కాగా ఇటీవల ఈ పోర్నోగ్రఫీ మూలంగా దేశంలో దారుణాలు ఎన్నడూ లేనంత ఎక్కువ స్థాయిలో పెరిగాయని, అలానే కొందరు అమ్మాయిలు అయితే తమ సొంత వారినే నమ్మలేని పరిస్థితులను ఈ పోర్నోగ్రఫీ కారణ భూతంగా నిలుస్తోందని పలు నివేదికలు సంచలన వాస్తవాలు వెల్లడించడం జరిగింది. ఇక రాను రాను ఈ విధమైన పద్ధతులు మరింతగా పెరిగితే, సమాజంలో ఆడవారికి పూర్తిగా రక్షణ కరువై ఎన్నో దారుణాలు జరిగినా జరగవచ్చని మానసిక నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కావున ప్రభుత్వాలు ఇకనైనా ఈ పోర్నోగ్రఫీ భూతాన్ని అరికట్టేందుకు మరిన్ని చర్యలు తీసుకుంటే బాగుంటుందని ఎవరు అభిప్రాయపడుతున్నారు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: