కొంచెం సంతోషమైనా లేదా బాధ అనిపించినా మందు బాటిల్ చేతిలోకి రావాల్సిందే . ఈమోడ్రన్ ప్రపంచంలో ఇప్పుడున్న పరిస్థితిలో తాగకుండా ఉంటే అదో వింత అన్నట్లు తయారువుతున్నారు జనం. అయితే మద్యాన్ని ఎక్కువగా సేవించడం వల్ల.. కాలేయం పూర్తి స్థాయిలో చెడిపోతుంది. ఆల్కాహాల్ కారణంగా రక్తనాళాలు దెబ్బతింటాయి, శ్వాస వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయదు. దీనికి తోడు కడుపులో మంట, పేగుల్లో మంట వస్తుంది. దీనికి కిడ్నీ మూత్రపిండాల సమస్య కూడా తోడవుతుంది. ఒక సారి తాగుడుకు అలవాటు పడితే, అది తిరిగి తాగాలనే ఆలోచనలను మనస్సులో రేకెత్తిస్తుంది.

 

వాస్త‌వానికి ఆల్కహాల్ తాగడం ఆరోగ్యానికి హానికరం అని మందు బాటిల్స్ మీద రాసినా, చివరకు సినిమా థియేటర్,లో యాడ్ వేసినా చూపించినా మందు అలవాటును మాత్రం చాలా మంది మానడానికి ఇష్ట‌ప‌డ‌రు. అయితే అలాంటి వారు ఓ సింపుల్ ట్రిక్ ఫాలో అయితే స‌రిపోతుంది. అదేంటంటే.. మెంతి డ్రింక్..! అవునండీ మీరు విన్న‌ది నిజ‌మే. మానవ శరీరంలోని బి. పి షుగర్, అధిక బరువు లాంటి అనారోగ్య సమస్యలకే కాక తాగుడికి బానిసైన వారి ఆరోగ్యాన్ని కాపాడి, వారిని ఆ అలవాటు నుండి దూరం చేయడంలోనూ మెంతులు శక్తివంతంగా ఉపయోగపడతాయి. 

 

దీని కోసం మెంతుల‌ను నీటిలో నాలుగు గంట‌లు నాన‌బెట్టి, నీటితో సహా మెంతులను ఉడికించాలి. ఇప్పుడు ఈ నీటిలో తేనె క‌లిపి తాగుడు అలవాటు ఉన్నవారికి వారంలో రెండు మూడు సార్లు ఇవ్వాలి. ఈ మెంతి డికాక్షన్ తాగిస్తే.. డ్యామేజ్ అయిన లివర్ ను కాపాడుకోవచ్చు. ఈ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల మెంతుల్లో ఉండే చేదు, జిగురు స్వభావం మద్యం అల‌వాటు ఉన్న‌వారికి మద్యం అంటేనే ఓ రకమైన ఏహ్యభావం కలిగించేలా చేస్తాయి. సో.. త‌ప్ప‌కుండా ట్రై చేయండి..!

మరింత సమాచారం తెలుసుకోండి: