సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన తరువాత అరచేతిలోకి సెల్ ఫోన్లు వచ్చి చేరడం తో పోర్న్ వీడియోలను తిలకించడం టీనేజ్ యువత కు మరింత సులువయింది . టీనేజ్ వయస్సు లో పోర్న్ వీడియోలను తిలకిస్తున్న వారు , లైంగికవాంఛలు పెంచుకుని ముక్కుపచ్చలారని చిన్నారులపై దాడులకు తెగబడుతున్నారు . టీనేజర్స్ ఒక్కరే  కాకుండా , వయోబేధం తో సంబంధం లేకుండా చిన్నారులపై లైంగిక దాడులు చేస్తున్న వారి సంఖ్య రోజుకింత రెట్టింపు అవుతోంది . ముక్కు పచ్చలారని చిన్నారులు తమపై జరుగుతున్న లైంగిక దాడుల గురించి తెలుసుకునే లోపే జరగాల్సిన ప్రమాదం జరిగిపోతుండడం గమనార్హం .

 

 విజయవాడలో ఇటీవల  తల్లి తో వివాహేతర  సంబంధం పెట్టుకున్న పక్కింటి వ్య్తక్తే ,  చిన్నారి పై లైంగిక దాడికి పాల్పడి హత్య చేసిన విషయం తెల్సిందే . రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చిన్నారులపై లైంగిక దాడులు పెచ్చుమీరిపోయాయి . దీనికంతటికి కారణం రకరకాల కారణాలు ఉన్నప్పటికీ , చిన్నారులు మాత్రం సమిధలవుతున్నారు . కొన్ని కేసుల్లో  వివాహేతర సంబంధాలు కారణమైతే , మరికొన్ని సంఘటనల్లో చిన్నారులపై కొంతమంది మృగాళ్లు  తమ పశువాంఛ ను తీర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు . దీనికంతటికి అరచేతిలో విప్లవమంటూ వచ్చిన సెల్ ఫోన్ సంస్కృతే ప్రధాన కారణమని మానసిక నిపుణులు విశ్లేషిస్తున్నారు . తమ అరచేతి లోని సెల్ ఫోన్ లో అందుబాటు లో ఉండే విచ్చలవిడి పోర్న్ సైట్లు చిన్నారుల మానసిక పరిస్థితిపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయని అంటున్నారు .

 

పోర్న్ సైట్లలో మాదిరిగానే ఎవరితోనైన విశృంఖలంగా సెక్స్ చేయవచ్చునని భావిస్తోన్న టీనేజర్లు , తమకు అందుబాటులో ఉండే చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారని పేర్కొంటున్నారు . సెల్ ఫోన్లలో పోర్న్ సైట్లను , సెక్స్ వీడియోలను తక్షణమే నిషేధించాలని సూచిస్తున్నారు .  పోర్న్ సైట్ల నిషేధం ద్వారా   టీనేజర్ల మానసిక ప్రవర్తన మెరుగుపడే అవకాశం ఉందని అంటున్నారు .

మరింత సమాచారం తెలుసుకోండి: