మనిషికి ఆకలి దప్పులతో పాటు శృంగారం కూడా ఒక ముఖ్య అవసరం అనేది అందరికి తెలిసిందే. అయితే కొన్నేళ్ల క్రితం మన పూర్వీకులు మాత్రం శృంగారాన్ని ఎంతో ఆస్వాదిస్తూ భార్యాభర్తలిద్దరి మధ్య ఎటువంటి అరమరికలు లేకుండా చాలావరకు ఎంతో ఆనందంగా జీవించేవారు. అయితే ఆ విధంగా వారు ఆనందంగా ఉండడానికి కారణం అప్పటి దంపతుల మధ్య ఎంతో గొప్ప ప్రేమానురాగాలు మరియు నమ్మకం ఉండేవని, అలానే ఒకరిపై మరొకరికి ఎటువంటి అనుమానాలు కూడా ఉండేవి కాదని, అందుకే వారు శృంగారాన్ని ఎంతో ఆస్వాదించేవారని అంటున్నారు మానసిక నిపుణులు. అయితే రాను రాను స్త్రీ, పురుషల మధ్య శృంగారం అనేది ఒక సాధారణ అవసరం మాదిరిగా మారిపోయిందని, 

 

ఇక ఇటీవల కాలంలో అయితే ఎక్కువమంది భార్య భర్తలు దానిని ఒక సాధారణ క్రియగానే చూస్తూ, ఒకరిపై మరొకరికి ప్రేమ, అభిమానం లేకుండా శృంగారాన్ని కానిచ్చేయడం వలన, దానిలో తృప్తి లేక ఒకరిపై మరొకరికి అసహనం, అయిష్టం, తత్ఫలితంగా విడిపోవడం లేదా అక్రమ సంబంధాల బారిన పడడం జరుగుతోందని అంటున్నారు. ఇక నేటి మహిళల్లో చాలా మంది తమ భర్తలతో శృంగారాన్ని ఆస్వాదించలేకపోతున్నారని ఇటీవల కొన్ని నివేదికలు కూడా చెప్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎవరైతే తమతో ఎక్కువగా చనువుగా మరియు కలుపుగోలుగా ఉంటారో, అటువంటి వారితోనే నేటి అమ్మాయిలు శృంగారం చేయడానికి ఇష్టపడుతున్నారని, 

 

అలానే శృంగారం విషయంలో తమకు సంతృప్తి కలుగని విషయాన్ని తెలుసుకుని, తదనుగుణంగా రాబోయే రోజుల్లో నడుచుకునే మగవారినే నేటి అమ్మాయిలు ఎక్కువగా కోరుతున్నారట. దానితో పాటు ఎటువంటి పరిస్థితుల్లో అయినా తమ పై ప్రేమ, అనురాగం తగ్గకుండా వారిని ఎంతో చక్కగా చూసుకునే మగవారికి తమ ఓటని కూడా నేటి అమ్మాయిలు అభిప్రాయపడుతున్నారట. ఇక డబ్బు, హోదా, అందం, శరీర దారుఢ్యం వంటి వాటికంటే కూడా నిజాయితీ గల అబ్బాయిలతోనే తాము జీవించాలని వారు కోరుకుంటున్నారట. సో దీనిని బట్టి, అమ్మాయిల మనోభావాలకు అనుగుణంగా వారితో కలిసి జీవించే అబ్బాయిలు మసలుకుంటే తప్పనిసరిగా భవిష్యత్తులో వారికి లైంగిక విషయాల్లో చాలావరకు సమస్యలు వచ్చే అవకాశం తక్కువని అంటున్నారు నిపుణులు.... !!  

మరింత సమాచారం తెలుసుకోండి: