కార్డిఫ్ నగరానికి చెందిన 25 ఏళ్ళ యువతి చెరెల్ ఫరూగియా 'ఆక్వాజెనిక్ ఆర్టికేరియా' అనే ఒక వింత వ్యాధితో బాధపడుతోంది. చాలా అరుదుగా వుండే ఈ వ్యాధి, ఈ యువతికి తన బిడ్డకు జన్మనిచ్చిన తరువాత సోకింది. ఆమె రోజూ నరకం అనుభవిస్తోంది.

 

ఇదొక వింత వ్యాధి, వాటర్ ఎలర్జీలా అనిపించే ఈ వ్యాధి సోకిన వారు నీటిలో అస్సలు తడవకూడదు. వర్షంలో తడిసిన, నీళ్లు తాగిన లేక చెమట పోసిన శరీరం మీద బొబ్బలు వచ్చి శరీరం మొత్తం ఇన్ఫెక్షన్ సోకి వెంటనే చనిపోతారు. ప్రస్తుతం చెరెల్ ఫరూగియా ఈ వ్యాధితోనే బాధపడుతోంది ఆమె వర్షంలో తడవదు,  ఎక్కువగా నీళ్లు తాగదు చివరికి ఏడవదు ఎందుకంటే ఏడిస్తే కంటి నుంచి వచ్చే నీటి బొట్లు ముఖంపై పడి బొబ్బలు, దద్దుర్లతో శరీరం మొత్తం ఎర్రగా మారి చనిపోయే ప్రమాదం ఉంది.

 

ఈ వింత వ్యాధి సోకడంతో చెరెల్ ఫరూగియా తన రోజువారీ జీవితానికి దూరం అయింది కేవలం ఇంటికే పరిమితం అయింది. సాధారణంగా ఈ వ్యాధి శరీరాన్ని శుభ్రంగా ఉంచుకొని వారికి వస్తుందని భావించి ఫరూగియా కుటుంబ సభ్యులు తను వాడే షాంపులు మరియు సబ్బులు మార్చి చూసారు అయినా ఫలితం లేకపోవడంతో డాక్టర్స్ ను సంప్రదించగా ఇదొక వింత వ్యాధి అని చెరెల్ ఫరూగియాకు ఆక్వాజెనిక్ ఆర్టికేరియా అనే వ్యాధి సోకినట్లు తెలిపారు. ఇక ఈ వ్యాధి నుంచి జాగ్రతగా ఉండేందుకు ఆమె రోజుకు 10 మాత్రలు వాడాల్సి ఉంటుందని డాక్టర్లు సూచించారు. అలాగే ఫరూగియా నెలకు కేవలం 2 సార్లు మాత్రమే స్నానం చెయ్యాలని సూచించారు. ఇక ఈ వ్యాధికి పూర్తి పరిష్కారం చూపే విధంగా అనుభవజ్ఞులైన డాక్టర్స్ కు ఈ వింత వ్యాధి గురించి చెప్పారు. ఇక వారు కాస్త ఈ కేసు ను ఛాలెంజుగా తీసుకుని పరిశోధన చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: