ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 18 వేల ఏళ్ల నాటి కుక్క క‌లేబ‌రం చెక్కు చెద‌ర్లేదు. స‌హ‌జంగానే ఏ మృత‌దేహం అయినా రెండు రోజుల‌కే ఎలా కుళ్లిపోయి దుర్వాస‌న వ‌స్తుందో ?  ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. కానీ ఆ కుక్క క‌లేబ‌రం మాత్రం 18 వేల ఏళ్ల పాటు చెక్కు చెద‌ర‌కుండా ఉంది. ఈ క‌లేబ‌రం రష్యాలోని సైబీరియా ప్రాంతంలో బ‌య‌ట ప‌డింది.

 

కుక్క క‌లేబ‌రం ఇంకా పాడ‌కుండా ఇలాగే స‌జీవంగా ఉండడానికి ప్ర‌ధాన కార‌ణం మంచు. సైబీరియాలోని మంచు కింద అత్యంత శీతల ప్రాంతంలో ఇది కప్పబడి ఉండడంతో దాని శరీరంలోని చాలా భాగాలు కుళ్లిపోకుండా ఇప్పటికీ తాజాగా ఉన్నట్టు  శాస్త్రవేత్తలు గుర్తించారు. సైబీరియా ప్రాంతంలో ప‌రిశోధ‌న‌లు చేస్తోన్న శాస్త్ర‌వేత్త‌లు దీనిని క‌నుగొన్నారు.

 

ఈ శునకానికి డోగర్ అని శాస్త్రవేత్తలు నామకరణం చేశారు. ఈ డోగర్.. తోడేళ్లు, నక్కలకు మధ్యస్త జాతికి చెందినదని అంచనా వేశారు. ఈ కుక్క క‌లేబ‌రానికి స్వీడ‌న్ శాస్త్ర‌వేత్త‌లు డీఎన్ఏ ప‌రీక్ష‌లు చేసి ఇది మగ కుక్కేనని తేల్చారు. రెండేళ్ల వయసులోనే అది మరణించి ఉంటుందని నిర్ధారించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: