'ఆరోగ్యమే మహాభాగ్యం' ఊరికే అనలేదు మన పెద్దలు. ఎంత డబ్బు, పలుకుబడి ఉన్నా, ఆరోగ్యంగా లేకపోతే అవంతా వృదాయే కదా..! కాబట్టి, ఆరోగ్యానికి మించిన ఐశ్వర్యం లేదని గుర్తుంచుకోవాలి. ఇక అస‌లు విష‌యంలోకి వెళ్తే.. తేనెను రోజూ తీసుకోవడంవల్ల శరీరానికి శక్తి అందుతుంది. అంతేకాదు, తేనె మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే, నువ్వులు. వీటి నుంచి తీసిన నూనెను చాలామంది వంటల్లో వాడతారు. నువ్వులను డైరెక్ట్‌గా కొన్ని పిండి వంటల్లోనూ వేస్తారు. అయితే తేనె, నువ్వులను కలిపి ఉద‌యాన్నే తీసుకుంటే ఎన్ని ప్ర‌యోజ‌నాలో తెలుసా..? ఒక‌వేళ తెలియ‌క‌పోతే ఇప్పుడు తెలుసుకోండి..!

 

నువ్వులు, తేనె రెండింటి కాంబినేషన్ లో ప్రోటీన్స్ , క్యాల్షియం ఎక్కువ. దీంతో ఇవి శరీర నిర్మాణానికి ఉపయోగపడతాయి. ప్రోటీన్ల వల్ల కణజాలం పెరుగుతుంది. కాల్షియం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్లలకు తేనె, నువ్వులను రోజూ పెడితే చాలా మంచిది. తేనె, నువ్వులు రెండింటిలోనూ యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో ఇవి శరీర రోగ నిరోధకశక్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. వ్యాధులు రాకుండా చూస్తాయి. ముఖ్యంగా ఈ కాలంలో వచ్చే సీజనల్‌ వ్యాధులురావు. అదే విధంగా ఇది స్కిన్ మరియు హెయిర్ హెల్త్ కండీషన్ ను మెరుగుపరుస్తుంది.

 

ఈ రెండింటి కాంబినేషన్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది, ఇది రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. బ్రెయిన్ ఫంక్షన్ మెరుగ్గా ఉంచుతుంది, మతిమరుపు తగ్గిస్తుంది. అలాగే బరువు తగ్గించుకోవాలని కోరుకుంటున్నట్లైతే, తేనె, నువ్వుల మిశ్రమాన్ని తీసుకోవడం వల్ల పొట్ట నిండుగా ఉన్న అనుభూతి కలిగి, ఆకలి తగ్గిస్తుంది. దాంతో జంక్ ఫుడ్స్ జోలికి వెళ్ళకుండా చేస్తుంది. దాంతో బరువు తగ్గడం సులభం అవుతుంది. అలాగే దీన్ని తీసుకోవ‌డం వ‌ల్ల మహిళలకు రుతు సమయంలో వచ్చే నొప్పులు, తిమ్మిర్లు తగ్గుతాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: