నిత్యం వ్యాయామం చేయడం, సరైన సమయానికి పౌష్టికాలతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంత అవసరమో, రోజూ తగినన్ని గంటలు నిద్ర పోవడం కూడా అవసరమే. ఇది మనకు వైద్యులు ఎప్పటి నుంచో చెబుతూ వస్తున్నారు. మ‌న‌కు నిద్ర ఎంత ఆవ‌శ్య‌క‌మో అంద‌రికీ తెలిసిందే. నిద్ర వ‌ల్ల మన శ‌రీరం పున‌రుత్తేజం చెందుతుంది. అయితే నిద్ర‌పోతే ఆరోగ్య‌మే కాదు.. డ‌బ్బులు కూడా సంపాదించుకోవ‌చ్చు. అదేంటి నిద్ర‌పోతే.. డ‌బ్బులు ఎలా సంపాదించుకోవ‌చ్చు అని అనుకుంటున్నారా..? అవును మీరు విన్న‌ది నిజ‌మే..! ప్ర‌తి రోజు రాత్రి 9 గంట‌ల పాటు నిద్ర‌పోతే.. అక్ష‌రాలా ల‌క్ష రూపాయిలు సంపాదించ‌వ‌చ్చు.

 

మ‌ళ్లీ మీ మైడ్‌లో ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురుస్తుందా..? వాటికి స‌మాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం..! బెంగళూరుకు చెందిన ఓ కంపెనీ రోజూలాగే నిద్రపోయేవారికి బంఫర్ ఆఫర్ ప్రకటించింది. వేక్ ఫిట్ ఇన్నోవేషన్ ప్రై.లి కంపెనీ (Wakefit Innovations Pvt. Ltd.)  “ వేక్  ఫిట్ స్లీప్ ఇంటర్న్‌షిప్”  పేరుతో ఉద్యోగాన్ని ఆఫర్ చేస్తోంది. 100 రోజులు,   పత్రి   రోజూ రాత్రి 9గంటలు, వారానికి 7రాత్రులు  నిద్రిస్తే  లక్షరూపాయలు అందిస్తామని ప్రకటించింది. అయితే 100 రోజులు నిద్రించేందుకు  పరుపుల‌కు మాత్రమే అవ‌కాశం ఉంది.

 

స్లీప్ ఇంటర్న్‌షిప్‌లో ఈ పరుపులపై  ప్రతి రాత్రి 9 గంటలపాటు నిద్రపోవాలి. ఇలా 100 రోజులు నిద్రించాలి. ఇదంతా ఎక్కడో కాదు  మీ ఇంట్లోనే. నిద్రపోవడానికి డ్రెస్ కోడ్ ఉంటుంది.  నిద్రించే సమయంలో పైజామా ధరించాలని చెబుతోంది. మీకు ఇష్టమైన పైజామాను ధరించవచ్చని చెబుతోంది.  అలాగే కాఫీ, టీ లాంటి కెఫీన్ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగరాదు. ఫోన్లు, సోషల్ మీడియాకు కాస్త దూరంగా ఉండాలి. ఎంపిక చేసిన ఇంటర్న్‌కు టాస్క్‌ను సరిగ్గా పూర్తి చేసిన తర్వాత 100 రోజుల చివరిలో లక్ష రూపాయలు లభిస్తాయి.

 

అయితే ఈ స్లీప్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ పట్ల వేక్‌ఫిట్ కో ఫౌండర్, డైరెక్టర్ చైతన్య రామలింగ గౌడ మాట్లాడుతూ.. స్లీప్ ఇంటర్న్‌షిప్ అనేది నిద్ర, ఆరోగ్యంపై దృష్టి కేంద్రీకరించే ప్రయత్నం  అని పేర్కొన్నారు. మన జీవితంలో పని-జీవిత సమతుల్యతను కాపాడుకోవడంలో నిద్రను ఒక అంతర్భాగంగా మార్చడానికి మరొక మెట్టు అని అంటున్నారు. కాగా, నిద్రపోండి. మీకు వీలైనంత కాలం, మీకు వీలైనంత గాఢంగా!  పోటీ పడుతూ మరి నిద్రపోండి. మీరు విశ్రాంతి తీసుకోండి. మిగిలిన వాటిని మాకు వదిలేయండి. అంటూ కంపెనీ తన వెబ్ సైట్ లో పేర్కొంది. మరింకెందుకాలస్యం మీరు కూడా బాగా నిద్రించే వారైతే వెంటనే ఆ కార్యక్రమానికి దరఖాస్తు చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: