జీన్స్ ప్రస్తుత ప్రపంచం లో అబ్బాయిలతో పాటుగా అమ్మాయిలు కూడా ఎక్కువగా ఇష్ట పడుతున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో జీన్స్ ఇప్పుడు ఒక సంచలనం. ఈ జీన్స్ ని చిన్నపిల్లల నుండి పెద్ద వారి వరకు అందరూ ఉపయోగిస్తున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో తమను తాము సరికొత్తగా చూపించుకోవాలనుకుంటుంది యూత్. వేసుకోవడానికి ఈజీగా చూడటానికి అందంగా ఉండటం తో యువత వీటివైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. అందులోనూ కొంద‌రు టైట్ జీన్స్ వేసుకుంటారు. కానీ, ఆ జీన్స్ ఫ్యాషనే లేనిపోని అనారోగ్యాలకు కారణమవుతోందని తెలుసా? అవును మీరు విన్న‌ది నిజ‌మే..!

 

జీన్స్‌ వ‌ల్ల మ‌న‌కు ఎలాంటి అనారోగ్యాలు క‌లుగుతాయో, వాటిని వేసుకోవ‌డం వ‌ల్ల ఎలాంటి దుష్ప‌రిణామాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.  స్కిన్ టైట్ జీన్స్ వేసుకోవడం వ‌ల్ల ఎవ‌రికైనా తొడ‌లు, పిరుదులు, న‌డుం త‌దిత‌ర భాగాల్లో ఉండే కొవ్వు పైకి వ‌స్తుంది. దీంతో ఆ కొవ్వు ఇత‌ర భాగాల‌కు వ్యాప్తి చెందుతుంది. అప్పుడది హార్ట్ స్ట్రోక్స్‌, ఊపిరి తిత్తులు, జీర్ణాశ‌య సంబంధ వ్యాధుల‌కు దారి తీస్తుంది. టైట్‌ జీన్స్‌ వేసుకోవడం వల్ల ప్రతి 100 మందిలో 10 మందికి చర్మ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. టైట్‌ జీన్స్‌ వేసుకుంటే అనేక సమస్యలు వస్తాయని డాక్టర్స్ కూడా హెచ్చరిస్తున్నారు.

 

పురుషుల్లో అయితే స్కిన్ టైట్ జీన్స్ వ‌ల్ల వృష‌ణాలు దెబ్బ తింటాయి. అక్క‌డి న‌రాలు బాగా చెడిపోతాయి. దీంతో వీర్యం స‌రిగ్గా ఉత్ప‌త్తి కాదు. ఇది సంతాన సాఫ‌ల్య‌త‌పై ప్ర‌భావం చూపుతుంది. దీంతో పిల్లలు పుట్టే అవ‌కాశం త‌గ్గుతుంది. ముఖ్యంగా అమ్మాయిలు స్కిన్‌ టైట్‌ జీన్స్‌ వేసుకుంటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయంటున్నారు.  స్కిన్ టైట్ జీన్స్ వేసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో ఉండే క్రియేటిన్ కైనేజ్ ఎంజైమ్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో అది కండ‌రాల‌పై ప్ర‌భావం చూపుతుంది. ఫ‌లితంగా కిడ్నీలు కూడా చెడిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. సో.. బీ కేర్‌ఫుల్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: