'హనీమూన్'..ఇది సినిమా టైటిల్ కాదు. కొత్తగా పెళ్లైన జంట ఏకాంతంగా విహారప్రదేశాల్లో తిరుగుతూ ఆ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒకరినొకరు శారీరకంగా మానసికంగా దగ్గర కావడానికి ఎంచుకున్న పద్దతి. కానీ ఈ హనీమూన్ అనేది డబ్బున్న కుటుంబాలకి మాత్రమే కుదురుతుంది. నార్త్ తో పోల్చి చూస్తే సౌత్ లో ఇలా హనీమూన్ వెళ్లే మ్యారీడ్ కపుల్స్ చాలా తక్కువ. అంతేకాదు మన సంసృతి సంప్రదాయాలు, విలువలు, కట్టుబాట్లు కూడా హనీమూన్ ను దూరం చేస్తున్నాయి.

 

ఇక అన్నిటికంటే ముఖ్యమైనది మన ఆర్థిక పరిస్థితులు.. దక్షిణాది రాష్ట్రాల్లో మధ్యతరగతి దిగువ మధ్యతరగతి వాళ్ళే ఎక్కువ. అప్పులు చేసి పెళ్లి చేసుకోవడం.. పెళ్లి అయ్యాక ఆ అప్పులు మీద పడడంతో అలాడిపోతుండటం చూస్తేనే ఉంటాము. ఇది దాదాపు ప్రతి మధ్య తరగతి ఇంట్లోను ఉండే కష్టాలే. ఇలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఇక హనీమూన్ అనే మాటే వినిపించదు. అంతేకాదు ఎక్కువగా ఉమ్మడి కుటుంబాల్లోనే కొత్త జంటలు కాపురాలు పెడుతుంటారు. భాగస్వామితో కనీసం మనుసు విప్పి మాట్లాడుకునే ప్రైవసీ కూడా ఆ కుటుంబాల్లో కొత్త జంటలకు ఉండదు. ఏదో ఉన్నామా అంటే ఉన్నాము అన్నట్టుగా ఉంటారు. ఎప్పుడో ఇంట్లో వాళ్ళు గుడికో, పెళ్ళికో వెళ్ళినప్పుడే వీళ్ళకి కాస్త ప్రైవసీ దొరుకుతుంది. అందుకే వీళ్ళ మధ్య దాంపత్య జీవితం కూడా అంతా ఆసక్తిగా సాగదు.

 

కాబట్టే ఆర్థికంగా వెనుకబడి ఉండడం.. ఉమ్మడి కుటుంబాల వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో పెళ్లి తర్వాత కొత్త జంటలు సుఖపడడం లేదని జాతీయ నమూనా సర్వే-2018 ద్వారా షాకింగ్ విషయాలు బయట పడ్డాయి. దేశవ్యాప్తంగా చేసిన జాతీయ నమూనా సర్వే ఏపీలో పెళ్లి తర్వాత జంటలకు 'హ్యాపీ మారీడ్ లైఫ్' లేదని తేల్చింది. ఏపీలోని గ్రామీణ ప్రాంతాల్లో 41శాతం కుటుంబాలు కొత్తగా పెళ్లైన తర్వాత దాంపత్య జీవితాన్ని సరిగ్గా అనుభవించలేకపోతున్నారని సర్వే తేల్చింది. ఇక అర్భన్ ప్రాంతాల్లో 29శాతం మందికి ఇదే పరిస్థితి అని కుండబద్దలు కొట్టినట్టు తేల్చి చెప్పింది. ఇందుకు ముఖ్య కారణం ఆర్థిక పరిస్తితులేనని తెలిసింది. అందుకే ఉన్నదాంట్లోనే గుట్టుగా కాపురాన్ని నెట్టుకొస్తున్నారట.

 

ఇక దేశంలోనే పెళ్లి తర్వాత ప్రైవసీని మెయింటేన్ చేస్తూ అత్యధికంగా ఎంజాయ్ చేసే వాళ్లు కేరళ వాసులేనట. కేరళ గ్రామాల్లో 89శాతం అర్భన్ ప్రాంతాల్లో ఏకంగా 93శాతం మంది పెళ్లి తర్వాత దాంపత్య జీవితాన్ని మనస్పూర్తిగా అస్వాదిస్తున్నారని సర్వే తేల్చింది. ఇలా దేశం మొత్తంలో ఏపీలో పెళ్లి తర్వాత దాంపత్య జీవితం దారుణమని సర్వే తేల్చింది. కేరళలో హ్యాపీ మారీడ్ లైఫ్ అని తెలిపింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: