జాక్ కలిస్ పేరు విన్నారా?, మీరు క్రికెట్ లవర్స్ అయితే తప్పకుండా ఈ పేరు విని ఉంటారు. దక్షిణాఫ్రికా దేశానికి చెందిన కలిస్ క్రికెట్ కు గుడ్ బై చెప్పి చాలా కాలం అయింది అయితే ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి వచ్చాడు అయితే ఈ సారి స్పోర్ట్స్ న్యూస్ లో కాకుండా వింతగా కనిపిస్తూ తన ఫ్యాన్సును అలరిస్తున్నాడు. మగ వాళ్ళ ముఖంపై అందంగా కనిపించేవి మీసం మరియు గడ్డం చాలా మంది వీటిని స్టైలిష్ గా మార్చుకుని హ్యాండ్సమ్ గా కనిపిస్తారు కానీ మనోడు దీనికి బిన్నంగా సగం గడ్డం సగం మీసం తో వింతగా కనిపిస్తూ రోడ్లు మీద తిరుగుతున్నాడు. 

 

ఇలా సగం గడ్డం మీసాలతో ఉండడం ఫ్యాషన్ కోసం కాదు దీని వెనుక ఒక మంచి కారణం ఉంది. ఈ 44 ఏళ్ల క్రికెటర్ దక్షిణాఫ్రికాలో 'సేవ్ ది రైనో' సవాలును స్వీకరించాడు, ఇది దేశంలోని ఖడ్గమృగాల సంఖ్య ను కాపాడటానికి అవగాహన మరియు ఖడ్గ మృగాల సంరక్షణ కు ఉద్దెశించిన సంస్థ. ఇక ఈ ఛాలెంజ్ లో పాల్గొనాలంటే సగం గడ్డం మరియు సగం మీసాలతో తిరగాలి. 'సేవ్ ది రైనో' అనేది ఒక లాభాపేక్షలేని సంస్థ, ఇది జంతువులను రక్షించే దిశగా పనిచేస్తుంది.

 

ఇక ఇలా విచిత్ర వేషంతో తిరుగుతూ కలిసి ఇప్పటి వరకు ఇప్పటివరకు నాలుగు లక్షల ఎనబైవేల రాండ్స్ (దక్షిణాఫ్రికా కరెన్సీ) విరాళాల రూపంలో సంపాదించాడు జాక్ కలిస్. తన ఫోటో ను ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసి ఈ నెలాఖరు వరకు ఇలాగే వుంటా అని అసలు విషయం చెప్పిన కలిస్ కు నెటిజన్స్ జేజేలు కొడుతున్నారు. వన్యప్రాణి సంరక్షణ కోసం జాక్ కలిస్ మంచి పని చేశారు మిగతా క్రికెటర్లు కూడా కలిస్ నుండి స్ఫూర్తి పొంది వన్యప్రాణి సంరక్షణకు కృషి చేయాలనీ నెటిజన్స్ కోరుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: