దేవుడు లేని ప్రతీ చోట అమ్మను సృష్టిస్తాడు. కాని అమ్మ విలువ తెలుసుకోకుండా అమ్మను ఇంటి నుండి గెంటేసాడు ఓ కసాయి కొడుకు. కన్న తల్లికన్నా ఆస్తులు ఎక్కవ అనుకున్నాడు. ఆస్తి లాక్కుని తల్లిని వీధిపాలు చేసాడు. 

 

వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన దుర్గమ్మ (73)కు ఓ కొడుకు, కూతురు. భర్త చనిపోవడంతో రోజు కూలి పనికి వెళ్తూ పిల్లల్ని పెంచింది. రోజు సంపాదనతోపాటు ప్రభుత్వం ఇచ్చే పింఛన్, ఇంటిపై వచ్చే అద్దె డబ్బులతోనే నెట్టుకువచ్చింది. కొడుకు కూతురికి పెళ్లిళ్ళు చేసింది. ఇంక తన భాద్యత తీరింది అనుకుని కొడుకువద్దే కాలం గడుపుదామనుకుంది.  

 

వ్యాపారం చేసే కొడుకు శ్రీనివాస్ మూడేళ్ల క్రితం హైదరాబాద్ లోని యూసుఫ్ గూడకు మకాం మార్చడంతో కొడుకుతోపాటు తాను వచ్చేసింది. మాచర్లలోని ఇంటిపై వచ్చే అద్దె డబ్బులతోపాటు, తనకు వచ్చే పింఛన్ మొత్తాన్ని కూడా కొడుకుకే ఇచ్చి వారి చెంతనే బతుకీడుస్తోంది. అయితే హైదరాబాదు మకాం మార్చే ముందు కొడుకు మాచర్లలోని ఇంటిని తనఖా పెట్టి డబ్బు ఇప్పించాలంటే  తల్లి కొడుకు మాటను కాదనలేక అలాగె చేసింది. ఇల్లు తనఖా పెట్టి డబ్బును కొడుకు చేతుల్లో పెట్టింది.

 

ఇంత చేసినందుకు తనను కొడుకు బాగా చూసుకుంటాడన్న ఆమె ఆశ నిజం కాలేదు. దీంతో తాను  సొంతూరికి వెళ్లిపోతే బాగుంటుందన్న ఉద్దేశంతో మాచర్లలోని తన ఇంటిని విడిపించి ఇవ్వాలని కొడుకును కోరింది. దీంతో కన్న తల్లి అని చూడకుండా తల్లిని ఇంటి నుండి గెంటేసాడు. 

 

సిటీలో దిక్కుతోచని ఆతల్లి ఎక్కడికి వెళ్లాలో తెలియలేదు. ఎం చేయాలో అర్ధంకాక ఎస్.ఆర్.నగర్ పోలీసులను ఆశ్రయించింది. ఆమె పరిస్థితి చూసి జాలిపడిన ఏఎస్ఈ నిర్మలాదేవి భోజనం పెట్టి ఆమెను ఆదుకుంది. కొడుకు శ్రీనివాస్ ను పిలిపించి బుద్ది చెప్పి తల్లిని అతనితో పంపిచనున్నట్లు వివరించారు. తల్లి విలువ తెలియని కొడుకులెందుకు..

మరింత సమాచారం తెలుసుకోండి: