తలనొప్పి చాలా రకాలుగా వస్తుంది. ఒక్కోసారి తల పగిలిపోయేంత నొప్పి వస్తుంది. కొందరికి ఒకే వైపు నొప్పి కలుగుతుంది. ఒక్క రోజు సరిగా నిద్రలేకపోయినా, పని ఒత్తిడి పెరిగినా.. ఇలా కారణం ఏదైనా ముందు వచ్చేది తలనొప్పే అని చెప్పాలి.  తలనొప్పి కొందరిని బాగా వేధిస్తుంది. దాంతో ఏం చేయాలో అర్థంకాక సతమతమవుతుంటారు. కొందరు తట్టుకోలేక ట‌క్కున‌ టాబ్లెట్స్‌ వేసుకుంటారు. అలా చేయటం ప్రతిసారీ మంచిది కాదు. శరీరానికి మందులు అలవాటు చేస్తే భవిష్యత్తులో చిన్న చిన్న రోగాలే మందులకు లొంగకుండా పెద్దవయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే చిన్న చిన్న చిట్కాల ద్వారా ఈజీగా త‌ల‌నొప్పికి చెక్ పెట్ట‌వ‌చ్చు.

 

గంధాన్ని కొంచెం పేస్టులా చేసి తలకు రాసుకుని, కొంచెంసేపు విశ్రాంతి తీసుకుంటే సులువుగా త‌ల‌నొప్పి తగ్గిపోతుంది. కుర్చీలో కూర్చొని పాదాలను వేడి నీళ్లు నింపిన బకెట్‌లో ఉంచాలి. నిద్రకు ముందు ఇలా కనీసం పావుగంట పాటు చెయ్యడం వలన దీర్ఘకాలికంగా ఉన్న తలనొప్పి, సైనస్ వల్ల వచ్చిన తలనొప్పి తగ్గిపోతుంది. అలాగే గోరువెచ్చని ఆవుపాలు తాగినా త‌ల‌నొప్పి నుంచి సులువుగా రిలాక్స్‌ అవ్వొచ్చు.

 

నియాలు, చక్కెర, నీళ్లు కలిపి తాగినా తలనొప్పి తగ్గుతుంది. జలుబు వల్ల వచ్చిన తలనొప్పయితే ఈ వంటింటి చిట్కా చాలా మంచి ప్రభావాన్ని చూపుతుంది.  గ్రీన్‌ టీలో కొంచెం తేనె, చిన్న దాల్చినచెక్క వేసుకుని తాగినా తగ్గుతుంది. అయితే శరీరంలో నీటి శాతం తగ్గినపుడు తలనొప్పి వచ్చే అవకాశాలు ఎక్కవ. కనుక ఎప్పటికప్పుడు శరీరానికి కావాల్సినంత నీటిని తాగుతూ ఉండాలి. దీంతో తలనొప్పిని నివారించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: