ఒక్కోక్కరిది ఒక్కోటేస్ట్. కొంత మందికి బంగారం అంటే ఇష్టం, బంగారంతో వివిధ రకాల నగలు, పాత్రలు చేయించుకుంటారు. మరికొంత మందికి డబ్బు అంటే ఇష్టం ..అయితే డబ్బుతో వివిధ రకాల వస్తువులను కొనుక్కోవడం, షాపింగ్ చేయడం అంటే ఇష్టం. ఇంకొంతమంది వాహనాల బాడీకి ప్రాదాన్యం ఇస్తారు. అప్పుడెప్పుడో గాలి జనార్దనరెడ్డి బంగారు సింహాసనాన్ని తయారు చేయించుకుని ఇంట్లో పెట్టుకున్నాడని చదివాం. అభిరుచులు భిన్నంగా ఉంటాయి. ఒక్కొక్కరికీ ఒక్కో ఆలోచన ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న ఈ కుర్చీ కూడా బంగారం కాదుకాని కరెన్సీ కట్టలతో తయారు చేసారు. కరెన్సీ తో కుర్చీ తయారు చేయడం ఏంటా అని ఆలోచిస్తున్నారా .. అయితే ఈ వింత మీరు తెలుసుకోవలసిందే..


తాజాగా రష్యా రాజధాని మాస్కోలో నోట్ల కట్టలతో తయారు చేసిన కుర్చీ ప్రత్యేక ఆకర్షణీయంగా మారింది. అయితే ఈ కుర్చీని ఎవరూ తయారు చేయించుకోలేదు. ఔత్సాహికులే కుర్చీని తయారు చేసి ప్రదర్శనలో ఉంచారు. ఈ కుర్చీని చూసేందుకు అక్కడి జనం క్యూ కడతున్నారు. ఆసక్తి ఉన్న వారెవరైనా దీన్ని కొనుక్కోవచ్చని ఔత్సాహికులే ఆఫర్ ఇచ్చారు. గాజు పలకుల మద్య కరెన్సీ ని ఉంచి తయారుచేసిన కుర్చీ. ఇలా తయారు చేయడానికి చాలా కష్టపడ్డామని నిర్వాహకులు చెబుతున్నారు. అయితే మీరు ఈ కుర్చీని కొనుక్కోవడానికి మాత్రం మాస్కోకి వెళ్లాల్సిందే మరి.


ధర మాత్రం మనం అనుకున్నట్లుగాలేదండోయ్. కుర్చీ ధర పదిలక్షల డాలర్లు అంటే మన కరెన్సీలో ఏడు కోట్ల 17 లక్షల రూపాయలు చెల్లించాలి మరి. అబ్బో...ఇంత ఖరీదా అనుకుంటున్నారా? గాజు పలకలతో ఫ్రేం తయారుచేసి వాటి మధ్య డాలర్ల కట్టలు ఉంచడం వల్లే ఇంత ఖరీదు. మరి ఈ కుర్చీని కొనే వారు ఉన్నారంటారా.. అంత డబ్బు పెట్టి కుర్చీని కొనుకున్నే  ఆ దృష్టవంతులు ఎవరో వేచి చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: