అమృత భర్త ప్రణయ్ హత్య కేసులో మారుతీ రావును పోలీసులు మరోసారి అరెస్ట్ చేసారు. ఆస్తి పంపంకాల విషయంలో తనని ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఫిర్యాదు చేసింది. దీంతో మళ్లీ మారుతీరావు ను కటకటాల వెనక్కి పంపారు. 

 

గతేడాది తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన కులదురహంకార హత్య సంచలాన్ని సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ప్రణయ్ హత్య కేసులో ప్రధాన నిందుతులైన మారుతీరావు పైకేసు నమోదు అవడం..బెయిల్ మంజూరు అయ్యి  జైలునుండి యటకిచ్చాడు. కాని మళ్లీ మారుతీరావు, ఎంఏ కరీంలపై మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో శనివారం మరో సారి కేసు నమోదైంది. మారూతీ రావుతో పాటు కరీంను కూడా అరెస్టు చేశారు. మారుతీరావు, కరీం, వెంకటేశ్వర రావులపై పోలీసులు వివిధ సెక్షన్ల క్రింద కేసులు నమోదు చేసారు.

 

ఈ ముగ్గురిపై 452, 506, 195ఎ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వారిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. వారికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధంచింది. ఆస్తుల పేరుతో తనను ప్రలోభపెట్టడానికి తన తండ్రి మారుతీరాను ప్రత్నిస్తున్నాడని అమృత ఫిర్యాదు చేసింది. 

 

ఇదే క్రమంలో కొన్ని రోజల క్రితం మారుతీ రావుకు బాగా సన్నిహితుడైన కందుల వెంకటేశ్వరరావును మత్తిరెడ్డికుంటలోని అమృత ఇంటికి రాయబారానికి పంపించాడు. తన తండ్రి మారుతీరావు చెప్పినట్లు నడుచుకుంటే ఆస్తినంతా నీకు రాసిస్తానంటున్నాడని, తన తండ్రికి నచ్చిన వారిని మళ్ళీ పెళ్లి చేసుకోవాలని వెంకటేశ్వరరావు అమృతను ప్రలోభపెట్టాడని తెలిపారు.

 

ఈ విషయాన్ని విన్న అమృత ససేమిరా అని ఈనెల 11న మిర్యాలగూడ వన్‌టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదును అందుకున్న పోలీసులు విచారణ జరిపించి మారుతీరావు, కరీం, వెంకటేశ్వరరావును  అరెస్టు చేశారు. అనంతరం మిర్యాలగూడ కోర్టులో హాజరుపరిచి అక్కడి నుంచి సబ్‌ జైల్‌కు తరలించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: