మనలో చాలా మందికి ఉదయాన్నే నిద్ర లేవగానే టీ తాగడం అలవాటు. ఒక్క పూట టీ తాగకపోతే ఏదో వెలితిగా, తలనొప్పిగా ఉంటుంది. అదీ చలికాలంలో అయితే వేడివేడి ఛాయ్, కాఫీలు సిప్ వేసుకుంటూ తాగితే ఆ మజానే వేరు. అయితే టీ,కాఫీలు తాగడం వల్ల చాలా నష్టాలున్నాయన్న వార్తలు చాలనే విన్నాం. దీంతో టీకి దూరంగా ఉండెందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. కానీ అది సాధ్యం కాదు.  అయతే దేనికైనా హద్దు ఉంటుంది కదా. మోతాదుకు మించి తాగితే ఉపశమనం పక్కకు పెడితే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి.

 

తేనీటిలో ఉండే కెఫిన్ మెదడును చురుగ్గా ఉంచుతుంది. కానీ అధిక మోతాదులో టీ లాగిస్తే.. నిద్ర సరిగా పట్టకపోవడం లాంటి సమస్యలు తలెత్తుతాయి. కాస్త తలనొప్పిగా అనిపించడం, తల తిరగడం టీ తాగడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్‌లు. నిజానికి టీ తాగడం వల్లనే తలనొప్పి రావడం, కడుపులో మంట పుట్టడం వంటివి వస్తాయట. ముఖ్యంగా గర్భం దాల్చిన వారు టీ మానేయడమే ఉత్తమం. పిండం ఎదుగుదల కెఫిన్ హాని కలిగించే అవకాశం ఉంది. అదే జరిగితే అబార్షన్ అవుతుంది.

 

ఒక్కసారిగా గ్లాసులకు గ్లాసులు టీ తాగితే కడుపు నొప్పితో పాటు, తలనొప్పి, అజీర్ణం వంటివి సహజంగానే వస్తాయి. దాంతో పాటు టీ ఆకుల వల్ల నోరు చేదుగా, పొడి బారడం కూడా ఏర్పడవచ్చు. అదే విధంగా.. టీ అసిడిక్ స్వభావం కలిగి ఉంటుంది . కాబట్టి, పరగడుపున టీ తాగడం వల్ల ఎసిడిటికి కారణమవుతుంది. వేడి వేడి టీ తాగడం వల్ల ఓసియో ఫాగల్ క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. రోజూ వేడి వేడిగా బ్లాక్ టీ తాగడం వల్ల ఓసిఫాగల్ క్యాన్స రిస్క్ పెరుగుతుందని రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో కూడా వెల్లడించారు. సో.. బీ కేర్‌ఫుల్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: