ఉదయం కాలేజ్ కి వెళ్లింది. రాత్రికి ఇంటికి రాలేదు. తల్లిదండ్రులు పోలీస్ స్టోషన్ లో ఫిర్యాదు చేసారు. కాని అంతలో నీటిలో శవమై తేలింది. మహబూబ్ నగర్ లో ఈ విషాదకర ఘటన చోటుచేసకుంది.  వివరాల్లోకి వెళితే.. 


 
మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట అంబగిరి మండలం బల్బూరు గ్రామానికి చెందిన సత్తమ్మ, వెంకటేశ్‌లు కొన్నేళ్ల వెంకటేశ్వరకాలనీలో ఉంటున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు.. ముగ్గురిలో కుమార్తెల్లో చిన్నదైన మేగావత్‌ ప్రియాంక(17)లాల్‌బజార్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్‌ చదువుతోంది.  ప్రతీ రోజు తండ్రి వెంకటేశ్‌ బస్ స్టాప్ వద్ద బండిమీద దింపి వెళతాడు. ఆతరువాత ప్రియాంక బస్సు, లేదా ఆటోలో కాలేజ్ కి వెళుతుంది.  

 

అలగే నవంబర్‌ 25న తండ్రి బండిమీద బస్ స్టాప్ వద్ద ప్రియాంకను దింపి వెళ్లిపోడు. ఆతవాత ఆమె ఆటోలో కాళాశాలకు వెళ్లిపోయింది. ఆరోజు కాలేజీకి వెళ్లిన ఆమె ఇంటికి తిరిగి రాలేదు. దీంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు ఆమెకోసం పలు చోట్ల వెతికారు. కాని ప్రయోజనం లేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేసారు.  పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రాంభించారు.

 

అయితే నవంబర్ 27 తేదీన ప్రియాంక మృతదేహం డిండి ప్రాజెక్ట్ లో లభించింది. దీంతో ఉప్పు నూతల పోలీసులు కేసు నమోదు చేసారు. ఈ విషయం తల్లిదండ్రులకు తెలపడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని ప్రియాంక మృతదేహంగా గుర్తించారు. పోస్ట్ మార్టం అనంతరం ప్రియాంక మృతదేహానికి   అత్యక్రియలు నిర్వహించారు. దీంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. 

 

ప్రియాంక ఊపిరితిత్తులోకి అధికంగా నీరు చేరడం వల్ల ఆమె మరణించిందని పోస్టుమార్టంలో తేలింది. 
అసలు ప్రియాంక డిండి ప్రాజెక్ట్ దగ్గరికి ఎందుకు వెళ్లింది. ఎవరైనా తీసుకుకుని వెళ్లారా.. నీటిలోకి తోసేసారా..ఆమే ప్రమాదవశాత్తు పడిపోయిందా ..లేదా ఆత్మహత్య చేసుకుందా ..అనే కోణాలలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: