ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలో తహసీల్దార్ ఆఫీసుల వద్ద రైతుల హంగామా ఆగటం లేదు. ప్రజలు తహసిల్దార్ విజయారెడ్డి సజీవ దహనం ఘటన ఇంకా మర్చిపోలేదు. అప్పటి నుండి ఇప్పటి వరకు పరిస్థితులలో ఏ మాత్రం మార్పు రావటం లేదు .ఇటీవల కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ బాటిల్ తో వెళ్ళిన ఓ రైతు అక్కడ సిబ్బందిని భయాందోళనకు గురి చేశారు. అక్కడ ఆఫీసు సిబ్బందిపై పెట్రోల్ చల్లిన రైతు హంగామా సృష్టించిన ఘటన మరచిపోకముందే మరో ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

 

తహసిల్ధార్ విజయారెడ్డి సజీవ దహనం తెలంగాణా రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోయినట్లు లేరు. తహసిల్ధార్ ఆఫీస్ ఆఫీసుల వద్ద ఇంకా రైతుల రచ్చ జరుగుతూనే ఉంది. ఇటీవల కరీంనగర్ జిల్లా చిగురుమామిడి తహసీల్దార్ కార్యాలయంలో పెట్రోల్ బాటిల్ తో వెళ్ళిన ఓ రైతు అక్కడ సిబ్బందిని భయాందోళనకు గురి చేశారు. అక్కడ ఆఫీసు సిబ్బందిపై పెట్రోల్ చల్లిన రైతు హంగామా సృష్టించిన ఘటన మరచిపోకముందే తాజా గా మరో ఘటన ఖమ్మం జిల్లాలో చోటు చేసుకుంది.

 

వారంతా రైతులు.. భూమినే నమ్ముకుని వ్యసాయం చేసుకుంటున్న అన్నదాతలు. వారు వ్యవసాయం చేసుకుంటున్న భూమికి పట్టాదార్ పాస్ పుస్తకాలు మాత్రం ఏళ్లు గడుస్తున్నా వారికి అందివ్వలేదు. పదేళ్ల నుంచి తహసీల్దార్ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నారు. కనిపించిన ప్రతి అధికారికి, ప్రతి ఎమ్మెల్యేకి, ప్రజాప్రతినిధులకు తమ గోడును వెళ్లబోసుకుంటూనే ఉన్నారు. కానీ వారి పట్ల ఏ ఒక్కరూ కనికరం చూపలేదు. 

 

దీంతో తమకు చావే శరణ్యమనుకున్నారు.. తుమ్మలపల్లి గ్రామానికి చెందిన గుండ్ల రాములు, అచ్చెన హుస్సేన్, అచ్చెన వెంకటనర్సమ్మతో పాటు సుమారు 30మంది రైతులు. సోమవారం ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు డబ్బాలతో నిరసనకు దిగారు. తమకు పట్టదారు పాస్ పుస్తకాలు ఇవ్వకపోతే తాము పురుగుల మందు తాగడంతో పాటు తహసీల్దార్ కార్యాలయం సిబ్బందికి తాగిస్తామంటూ అక్కడే బైఠాయించారు. 

 

అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేసినా ఏ ఫలితం లేకపోయింది. రైతులు ఆందోళనతో పాటు బెదిరింపులకు పాల్పడటంతో రైతులు పురుగుల మందు డబ్బాలతో రావడంతో అధికారులు టెన్షన్ పడుతున్నారు. ఎప్పుడేం జరుగుతుందోనని భయపడుతున్నారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పని చేయలేమని వారు చెప్తున్నారు. రైతులు ఇలా ప్రతి దానికి ఒత్తిడి పెడితే , బెదిరిస్తే ఎలా పని చెయ్యగలం అని తహసీల్దార్ ఆఫీస్ అధికారులు చెప్తుండటం గమనార్హం. 

ఇంతలో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని సముదాయించారు. అధికారులు కూడా కలుగజేసుకుని వారికి న్యాయం చేస్తామని హామీనిచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: