హైదరాబాద్ :  తనను ఓ యువకుడు వేదిస్తున్నాడని.. అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటున్నానని తండ్రికి ఫోన్ చేసి చెప్పిన మౌనిక కేసు ఓ కొలిక్కి వచ్చింది. హైద్రాబాద్ లోని హమాయత్ నగర్ లో ఈ నెల 27 న అదృష్యమైన మౌనిక అనే యువతి ఆచూకి పోలీసులకు చిక్కింది. 


నిజామాబాద్ జిల్లా నవీపేటకు చెందిన మౌనిక హిమాయత్ నగర్‌లోని ఓ హాస్టల్‌లో ఉంటోంది. నారాయణగూడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఫస్టియర్ చదువుతోంది. హిమాయత్‌నగర్ నుంచి రోజూ కాలేజీకి వెళ్లే తనను ఓ యువకుడు వేధిస్తున్నాడని, వేధింపులు భరించలేకపోతున్నానని.. అందుకే తాను హుస్సేన్ సాగర్‌లో దూకి ఆత్మహత్య చేసుకుంటానని మౌనిక లేఖ రాసి హాస్టల్ నుండి బయటికి వెళ్లిపోయింది. వెళ్తూ తండ్రికి ఫోన్ చేసి ఆ యుకుడి టార్చర్ తట్టుకేలేకపోతున్నాని వాపోయింది.


హాస్టల్ గదిలోని ఆ సూడైడ్ లెటర్ ను చూసిన రూం మెంట్స్ యాజమాన్యానికి ఇచ్చారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆమె కోసం గాలింపు చేపట్టారు. ట్యాంక్‌బండ్, ఎంజీరోడ్ మినిస్టర్ రోడ్, బేగంపేట ప్రాంతాల్లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అయితే వారికి ఎలాంటి క్లూ దొరకలేదు.


మౌనిక తల్లిదండ్రులు ఇచ్చన ఫిర్యాదు మెరకు పోలీసులు మౌనిక కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసారు. పోలీసులకు అందిన సమాచారంతో మౌనిక గుంటూరులో ఉన్నట్లు గుర్తించారు. అయితే మౌనకతో పాటు ఓ యువకుడు ఉన్నట్లు గమనించిన పోలీసులు వారిని హైద్రాబాద్ కు తీసుకువస్తున్నారు. 


మౌనిక ఎందుకు ఇంత హైడ్రామా ఆడింది. మౌనికతో ఉన్న ఆయువకుడు ఎవరు. హైద్రాబాద్ నుండి గుంటూరు వెళ్లాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. అనే అంశాలపై పోలీసులు విచారణ చేపట్టారు. మొత్తానికి ఐదు రోజులు అటు కుంటుంబ సభ్యులను, ఇటు పోలీసులకు దొరక్కుండా కంగారు పెట్టిన మౌనిక చివరకు పోలీసులకు చిక్కింది. దీంతో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: