అసలే వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్న చ‌లి. రాత్ర‌యిందంటే చాలు… స్వెట్ట‌ర్ వేసుకుని, మంకీ క్యాప్ పెట్టుకుని దుప్ప‌టి త‌న్న‌క‌పోతే… చ‌లికి గ‌జ గ‌జా వ‌ణ‌కాల్సిందే. మ‌రి ఇలాంటి ప‌రిస్థితిలో చన్నీటితో స్నానం చెయ్యాలంటే ఒళ్ళు జివ్వుమంటుంది. చలికాలంలో చన్నీటి స్నానం అంటే అస్సలు ఒప్పుకోరు. వేడినీళ్ల స్నానాన్నే ఎక్కువమంది ఇష్టపడతారు. అయితే చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే కూడా మ‌న శ‌రీరానికి ఎన్నో లాభాలు క‌లుగుతాయట‌. అనేక ర‌కాల అనారోగ్యాల నుంచి ఉప‌శ‌మ‌నం కూడా ల‌భిస్తుంది.

 

క్రమం తప్పకుండా రోజూ చల్లని నీటితో స్నానం చేస్తే, చాలా వ్యాధులు నివారించవచ్చు. చల్లని నీరు రక్తప్రసరణ అధికం చేసి మీ రోగ నిరోధకత పెంచుతుంది. చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరం వేడెక్కుతుంది. దీంతో శరీరంలోని కొవ్వు కరిగుతుంది. అందువల్ల రోజూ చన్నీళ్ల స్నానం చేస్తే ఏడాదికి నాలుగు కిలోల వరకు బరువు తగ్గుతారు. చల్లని నీళ్ల వల్ల శరీరం వణుకుతుంది. రెగ్యులర్ గా చల్లని నీటి స్నానం చేస్తే మన శరీరంలో రోగాలతో పోరాడే తెల్ల రక్త కణాలు సంఖ్య పెరుగుతుందని రోగ నిరోధక శక్తి పెరుగుతుందని రీసెర్చి చెపుతోంది.  చ‌న్నీళ్ల‌తో స్నానం చేస్తే ఒత్తిడి, ఆందోళ‌న వంటివి దూర‌మ‌వుతాయి. డిప్రెష‌న్ త‌గ్గుతుంది.

 

మానసిక ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా స‌క్ర‌మంగా జ‌రుగుతుంది. దీంతో గుండె సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. చ‌ర్మం కాంతి పెరుగుతుంది. అదే విధంగా చ‌న్నీటితో స్నానం చేస్తే వెంట్రుక‌లు న‌ల్ల‌గా అవుతాయ‌ని ప‌లు ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. జుట్టు కూడా రాల‌కుండా దృఢంగా పెరుగుతుంది. చుండ్రు రాకుండా ఉంటుంది. చన్నీటి స్నానం చేయడం వల్ల ఊపిరితిత్తులు తెరుచుకొనేలా చేసి శారీర వ్యాయామంగా సహాయపడుతుంది . అందువల్ల కోల్డ్ బాత్ వల్ల ఉశ్చ్వాస నిశ్చ్వాసలు మరింత ఉత్తమంగా ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: