ఉసిరి ఔష‌ధాల పుట్ట‌గా ఆరోగ్య నిపుణులు అభివ‌ర్ణిస్తున్నారు. ఇందులో ఎలాంటి అతిశేయోక్తి లేద‌ని చెబుతున్నారు. అనేక పోష‌క ప‌దార్థాలు నిండి ఉండ‌టంతోనే ఉసిరికి ఇంత ప్రాధాన్య‌మ‌ని పేర్కొంటున్నారు. ఉసిరి కాయంటే తెలియని వారుండరు. పూర్వీకులు మ‌న‌కు ఇచ్చిన దివ్యాష‌దకాయ‌గా దీనికి పేరుంది. ఉసిరికాయతో రకరకాల వంటలు, ఊరగాయలు తయారుచేస్తారు.  ఉసిరికాయలో విటమిన్ సి, మరియు విటమిన్ ఐ పుష్కలంగా ఉంటుంది. 

 

ఉసిరి కాయలను, గింజలను, ఆకులను, పూలను, వేళ్ళను, బెరడును ఆయుర్వేద ఔషధాలలో వాడతారు. శృంగార సామ‌ర్థ్యాన్ని పెంపొందించ‌డంలో ఉసిరి ఎంత‌గానో తోడ్ప‌డుతుంద‌ని తాజా అధ్య‌య‌నాలు వెల్లడిస్తున్నాయి. ఒక్క ఉసిరి కాయ రెండు నారింజ పండ్లతో సమానమ‌ట‌. ఉసిరికాయ జ్యూస్ వల్ల చెప్పలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలుంటాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఉసిరి జ్యూస్ కొద్దిగా ఒపిక‌, స‌హ‌నంతో సేవిస్తే  ఆస్త్మా మరియు బ్రోన్కైటిస్ వంటి సమస్యల‌కు ప‌రిష్కారం ల‌భిస్తుందంట‌. దీనిలో ఉండే  యాంటి ఆక్సిడెంట్స్‌  వృద్ధాప్యాన్ని త‌గ్గిస్తాయి. 

 

తేనెతో కలపి ఆమ్లా జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల చ‌ర్మం ముడుత‌లు ప‌డ‌కుండా ఉంటుంద‌ని చెబుతున్నారు. అంతేకాక  శరీరంలోని అదనపు కొవ్వును కరిగించి బ‌రువు నియంత్ర‌ణ‌లో ఉండేందుకు దోహ‌దం చేస్తుంది. ఉసిరి జ్యూస్ ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల యూరినరి ప్రొబ్లెమ్స్ తగ్గించటంలో బాగా సహకరిస్తుంది.
వేసవి కాలంలో ఉసిరికాయ జ్యూస్ త్రాగడం వల్ల, శరీరాన్ని చల్లగా ఉంచి చర్మాన్నికి కావల్సినంత తేమనందిస్తుందంట‌. డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా కాపాడుతుంది.  ఇక ఆడ‌వారిలో అయితే  నెలసరి సమస్యలను త‌గ్గుముఖం ప‌ట్టేలా చేస్తుంది.

 

అంతేకాక పేగు కదలికలను క్రమబద్ద చేసి దీర్ఘకాల మలబద్ధ‌కాన్ని కూడా పార‌దోలుతుందంట‌.  ఉసిరిరసం మరియు తేనే కలిపి తీసుకుంటే రక్తాన్ని శుద్ది చేస్తుంది. ఉసిరితినటం వల్ల రక్త హీనత నుంచి కూడా రక్షించుకోవచ్చు.ఇలా లెక్క‌కు మిక్కిలి ఆరోగ్య ర‌హ‌స్యాల‌ను ఇమిడి ఉన్న ఉసిరిని ఏదో ఒక‌రూపంలో తీసుకోవ‌డం అంటే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవ‌డ‌మేన‌ని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: