ఆరోగ్యానికి పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. సుమారు 4,500 సంవత్సరాల నుంచి ప్రజలు పెరుగును తయారుచేసి తింటున్నారు. ఇది ప్రత్యేక ఆరోగ్యప్రయోజనాలున్న ఒక పోషకాహారం. ఇది ప్రోటీన్, కాల్షియం, రిబోఫ్లావిన్, విటమిన్ బీ6 మరియు విటమిన్ బీ12 వంటి పోషకాలను కలిగి ఉంది. కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండే, పెరుగు, బలమైన ఎముకలు మరియు పండ్లు అభివృద్ధికి దోహదపడుతుంది. పెరుగులో ఉండే యాంటీ ఆక్సిడెంట్‌లు చర్మాన్ని మృదువుగా ఉంచడమే కాకుండా, ముందస్తుగా వచ్చే ముడతలను తొలగిస్తుంది. 

 

అయితే సాధార‌ణంగా నాన్ వెజ్ ప్రియులు ఏదైనా నాన్‌వెజ్ ఆహారం తిన్నా త‌ర్వాత పాలు, పెరుగు తింటుంటారు. కానీ.. కొంద‌రు ఏ మాత్రం పెరుగును తిన‌రు. అయితే దీనిపై చాలా మందిలో కొన్ని అపోహ‌లు ఉన్నాయి. వాస్త‌వానికి చికెన్, మ‌ట‌న్ లాంటి నాన్‌వెజ్ ఆహారాల్లో ప్రోటీన్లు ఎలా అయితే ఉంటాయో పాలు, పెరుగుల్లోనూ ప్రోటీన్లు అలాగే ఉంటాయి. అయితే నాన్‌వెజ్ వంట‌కాల‌ను తిన్నాక పాలు, పెరుగు తాగితే దాంతో రెండు ఆహారాల నుంచి పెద్ద మొత్తంలో ప్రోటీన్లు మ‌న శ‌రీరానికి అందుతాయి. 

 

ఈ క్ర‌మంలో అంత పెద్ద మొత్తంలో అందే ప్రోటీన్ల‌ను అరిగించుకుంటే ఓకే. లేక‌పోతే అజీర్ణం ఇబ్బందులు పెడుతుంది. అయితే ఎలాంటి అనారోగ్య స‌మ‌స్య‌లు లేని నాన్ వెజ్ త‌ర్వాత పాలు, పెరుగు తింటే ఎలాంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు. అదే విధంగా, చేప‌లు వంటి వాటిని తిన్నాక  పాలు, పెరుగు వంటివి తాగితే కొంద‌రిలో స్కిన్ అల‌ర్జీలు వ‌స్తాయ‌ట‌. దీనికి తోడు, గుండె జ‌బ్బులు ఉన్న‌వారు పెద్ద మొత్తంలో అలా ప్రోటీన్ల‌ను ఒకేసారి తిన‌డం మంచిది కాద‌ట‌. సో.. బీ కేర్‌ఫుల్‌..!

మరింత సమాచారం తెలుసుకోండి: