శృంగారం.. ఈ సృష్టికే ఇది మూల కారణం. సృష్టిలోని ప్రతి జీవీ తన వారసత్వాన్ని కొనసాగించేందుకు ఉపకరిస్తున్న సృష్టి కారకం. అందుకేనేమో శృంగారం కోసం ఓ పులి ఏకంగా 1300 కిలోమీటర్లు తిరిగింది. తోడు కోసం దాదాపు 150 రోజులు తిరిగింది.. ఆశ్చర్యంగా ఉన్నా ఇది వాస్తవం.

 

వివరాల్లోకి వెళ్తే.. తోడు కోసం ఓ మగ పులి ఏకంగా 150 రోజులపాటు తిరిగినవిషయాన్ని అటవీశాఖ ధ్రువీకరించింది. పులి తోడు కోసం 13 వందల కిలోమీటర్ల ప్రయాణించినట్లు మహారాష్ట్ర అటవీ శాఖ వెల్లడించింది. ఆడ పులి కోసం ఆ మగ పులి.. మహారాష్ట్ర, తెలంగాణల్లోని 6 జిల్లాల్లోని వందలాది గ్రామాల్లోని అడవులను చుట్టి వచ్చిందట.

 

ఇలా తిరిగే క్రమంలో దానికి మనుషులు కనిపించినా ఎక్కడా దాడి చేయలేదట. ఆకలి తీర్చుకునేందుకు మాత్రం చిన్న చిన్న జంతువులను చంపిందట. ఈ కుర్ర పులి ఆడపులితో పొందు కోసం అలా 1300 కిలోమీటర్లు తిరిగిందట. చివరికి మహారాష్ట్రలోని బుల్డానా జిల్లాలోని ధ్యానగంగ అభయారణ్యానికి చేరుకుందని అటవీ సిబ్బంది తెలిపారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: