పై ఫోటోలో ఉన్న ఆమెను గుర్తుపట్టారా? తాను మన తెలుగు బిడ్డ అండి.. పేరు దాసరి రోహిణి సింధూరి.. ఖమ్మం జిల్లాలోని.. రుద్రాక్షపల్లి గ్రామంలో పుట్టింది. కానీ పెరిగింది మాత్రం హైదరాబాద్ లోనే. అయితే తన తండ్రి గారు హైకోర్టు జడ్జి అవడం.... ఇంకా ఆయనని హైదరాబాద్ కు బదిలీ చేయడం వలన వారి ఫ్యామిలీ అక్కడికి మకాం మార్చాల్సి వచ్చింది. రోహిణి... అమ్మమ్మ వాళ్లు నెల్లూరు జిల్లాలోని ఒక గ్రామంలో నివసించేవారు. అయితే అదే గ్రామ నివాసి అయిన సుధీర్ రెడ్డి అనే ఒక వ్యక్తిని రోహిణి పెళ్లి చేసుకుంది. అతను మొదటగా సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ చేసి ఆ తర్వాత ఒక పేపర్ కంపెనీ పెట్టుకున్నాడు. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసిన రోహిణి సింధూరి మాత్రం బాగా చదివి... 2009వ సంవత్సరంలో ఐఏఎస్ ఉద్యోగాన్ని సంపాదించింది. అయితే తనకు పై అధికారులు ఐఏఎస్ పోస్టింగ్ ని కర్ణాటక రాష్ట్రంలో ఇచ్చారు. ఇది మన రోహిణి సింధూరి నేపథ్యం గురించి...


అసలు విషయంలోకి వెళ్తే... ఓ ప్రాచీన శివాలయంలో రోహిణి సింధూరి పేరిట ప్రతి సోమవారము ప్రత్యేక పూజలు చేస్తున్నారు అక్కడ దేవస్థాన అర్చకులు. ఎందుకు అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ గుడి పేరు విరూపాక్షేశ్వర స్వామి గుడి. 9వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం కర్ణాటకలో ఉన్న హసన్‌లోని దొడ్డ బాసడి ప్రాంతంలో ఉంది. అయితే ఈ ప్రాచీన ఆలయం.. బాగా శిథిలావస్థలో ఉంది. ఈ విషయం కాస్త మన రోహిణి సింధూరికి తెలిసింది. అప్పట్లో తాను...హసన్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్‌గా బాధ్యతలను నిర్వహించేది… ఇకపోతే ఈ విషయం విన్న వెంటనే తానే స్వయంగా ఆలయం దగ్గరికి వెళ్లి అక్కడి ఆలయ సిబ్బందితో మాట్లాడి.... ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకున్నది. తర్వాత వాటికి పరిష్కారం ఎలా చేయాలో.. సమస్యలను ఎలా రూపుమాపాలని కొంత సమయం వరకు ఆలోచించింది... చివరికి తను పనిచేస్తున్న కార్పొరేషన్ ద్వారా 30 లక్షల రూపాయలను ఆ గుడికి కేటాయిస్తూ ఆలయంలో కరెంటు సౌకర్యాన్ని అందించి.. ఎంతో సహాయం చేసింది. దాంతో పాటు ఇంకా కొన్ని మౌలిక సదుపాయాలను ఏర్పరిచి ఆలయం రూపుమాపులు మారిపోయే విధంగా ఒక గాడిలో పడేట్లు చేసింది. కొన్ని నెలల తరువాత ఈమె వేరే ప్రాంతానికి బదిలీ అయ్యింది. బదిలీ అయినప్పటికీ... అక్కడి అర్చకులు మాత్రం రోహిణి సింధూరి పేరిట ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.


ఎందుకు ఇలా చేస్తున్నారని ఆలయ అర్చకుడైన నాగభాషణను ప్రశ్నించినప్పుడు 'ఆమె చేసిన సాయం వల్లే గుడి రూపరేఖలు మారిపోయాయి, అందుకే ప్రతి సోమవారం ఆమె పేరిట రుద్రాభిషేకం చేస్తున్నాం. సింధూరి కుటుంబ సభ్యుల పేర్ల మీద కూడా విరూపాక్షేశ్వర స్వామికి తొలి పూజలు చేస్తున్నాం. అంతకుముందు ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకోలేదు… నాయకులు, అధికారులు అణువంతైనా స్పందించలేదు… కానీ రోహిణి సింధూరి స్పందించింది… అందుకే ఈ కృతజ్ఞతాపూర్వక అర్చనలు’ అని చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: