ఈ రోజుల్లో అన్నీ ఖరీదైపోయాయి. దాంతో పిల్లల పెంపకం చాలా ఖరీదైపోయింది. ఆసుపత్రి ఖర్చులు, పిల్లల చదువులు, ఉన్నత చదువులు, వివాహం..ఇలా ప్రతిదీ లక్షల్లో ఖర్చవుతోంది. అందుకే ఇప్పుడు తల్లిదండ్రులు ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ కనే పరిస్థితుల్లో లేరు. ఇంకొందరైతే ఒక్కరితో సరిపెట్టుకుంటున్నారు.

 

అంతే కాదు.. వారి కోసం ముందు నుంచే ప్లాన్ చేస్తున్నారు. వారి భవిష్యత్ అవసరాల కోసం డబ్బు కూడా బెడుతున్నారు. దీనికోసం నగరాల్లో భార్యాభర్తలు ఇద్దరూ పని చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో వారు ఓ కీలక విషయం మరచిపోతున్నారు. పిల్లల కోసం పని చేయడం మంచిదే అయినా.. వారికి తల్లిదండ్రులు తగినంత సమయం కూడా ఇవ్వాలి.

 

రోజూ వారు స్కూల్లో ఏం చదివారో అడగాలి. వారితో కలివిడిగా మాట్లాడారు. వారి కబుర్లు వినాలి. అప్పుడే వారు సెక్యూరిటీ ఫీలవుతారు.ఇబ్బందులు మనసు విప్పి చెప్పగలుగుతారు. పిల్లలకు తగిన సమయం ఇస్తే.. అది వారు చదువుల్లో రాణించడానికి కూడా ఉపయోగపడుతుంది. గడియారంతో పోటీ పడే తల్లిదండ్రులు ఇది కాస్త గమనించాల్సిందే.

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: