మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన జంటను పిల్లాపాపలతో చల్లగా ఉండాలని దీవిస్తుంటారు.  పెళ్లి తర్వాత తల్లిదండ్రులుగా మారితే ఎన్నో బాధ్యతలు మోయాల్సి వస్తుంది. పూర్వ కాలంలో పది మంది పిల్లలను కన్నా ఆ కుటుంబంలో ఎలాంటి ఇబ్బందులు ఏండేవి కాదు.. కానీ ఇప్పుడు ఒకరు ఇద్దరు పిల్లలతో ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు తల్లిదండ్రులు.  ప్రస్తుతం కాలుష్య కారణాలు కావొచ్చు.. పిల్లల్లో అనారోగ్య సమస్యలు తలెత్తడం..ఇతర కారణాల వల్ల వారి బాధ్యత విషయంలో ఎంతో జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది.

 

చిన్నారులను పెంచడం అంటే ఓ చక్కని బాధ్యత. ఇందులో తల్లిదండ్రులు ఎన్నో ముఖ్య విషయాలు పాటించాలి. అప్పుడే చిన్నారులకు మంచి భవిష్యత్‌ని అందించిన వారమవుతాం. అందుకు పేరెంట్స్‌ పాటించాల్సిన కొన్ని కీలక విషయాల గురించి తెలుసకుందామా..

 

- చిన్నతనం నుంచి వారి నుంచే పిల్లలకు ప్రేమ, బాధ్యత వంటి వాటి గురించి తెలియజేయాలి. అప్పుడే వారి భవిష్యత్‌ బాగుంటుంది. పిల్లల పట్ల స్నేహపూర్వక వాతావరణం కలిగించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

 

- వారి సున్నతిమైన మనసు తెలుసుకొని వారి రూట్‌లోనే వెళ్తూ మంచి ఏదో.. చెడు ఏదో చెప్పాలి. పిల్లలను ఆడుతూ పాడుతూ పెంచాలి. అలా అని వారిని మొత్తం వదిలేయమని కాదు.. ఏ సమయాల్లో ఎలా ఉండాలో తెలుసుకోవాలి. 

 

- వారికి పూర్తి స్వేచ్ఛ ఇస్తూనే  ఓ కంట కనిపెట్టుకుని ఉండండి. అదేవిధంగా.. కొంతమంది తల్లిదండ్రులు మరీ స్వేచ్ఛనిస్తారు. ప్రేమ ఉండాలి కానీ, ఆ ప్రేమ వారిని పాడుజేసేలా ఉండకూడదు. ఈ విషయాన్ని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. 

 

- తల్లిదండ్రుల అభిలాష పిల్లలపై ప్రభావం చూపకూడదు. చాలామంది తల్లిదండ్రులు, ఇతర పిల్లలతో తమ పిల్లలని పోలుస్తూ ఎక్కువగా ఆశిస్తారు. ఇలా  చూసే రీతివల్ల పిల్లల ప్రవర్తనలో అత్యధిక ఉద్రిక్తత చోటుచేసుకొని, అకస్మాత్తుగావారి అభ్యసనాస్థాయి నిలిచిపోతుంది.

 

- లింగభేదం విషయంలో అందరి ప్రవర్తనా మారింది. అయినప్పటికీ కొంతమందిలో ఆ జాఢ్యం పోలేదు. ఇది ఎప్పటికీ మంచిది కాదు. ఆడ, మగ ఇద్దరూ సమానమే అని తెలుసుకుని ఆ విధంగానే పిల్లల్నీ పెంచండి. 

 

- తల్లిదండ్రులు  తమ పిల్లలు తమకు మూసపోతలు కారని, స్వతంత్రవ్యక్తులని  వాస్తవికతను  గుర్తించలేకపోతున్నారు.
చదువులో ఉత్తీర్ణత సాధించడం ఒక్కటే జీవనసరళిలో విజయవంతమైన సోపానం కాదని, గెలుపూ ఓటములకు ఇది ఒక కారణం మాత్రమేనని గుర్తించాలి.

 

- పిల్లల్ని గారాబం చేయాలి. అంతేకానీ, వారిని సోమరిపోతులుగా మార్చకూడదు. అందుకే చిన్నతనం నుంచే కొన్ని పనులు వారే స్వతహాగా చేసుకునేలా అలవాటు చేయాలి.

 

- పిల్లలకి చక్కని విద్య అందించడమనే విషయంలో ఉపాధ్యాయుల బాధ్యత ఎంత ఉందో.. తల్లిదండ్రుల బాధ్యత కూడా అంతే ఉంటుంది. పిల్లలను విమర్శించడం కంటే వారు ఏ తప్పులు చేస్తున్నారో ప్రేమగా చెప్పి చూడాలి. వారిని మార్చే ప్రయత్నం ప్రేమతోనే మొదలవ్వాలి. ఆత్మవిశ్వాసం, సహనం, అభినందలతో కూడిన పెంపకం ఎప్పుడూ కూడా.. ఎదుటివారిని గౌరవిస్తూ నీతిగా బతకడం నేర్పుతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు ముఖ్యంగా ఓ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

 

- తల్లిదండ్రులే పిల్లలకు ఆదర్శం. స్నేహపూర్వక, సౌఖ్యవంతమైన స్వేచ్ఛను పిల్లలకు కల్పించాలి. విలువలకు, లక్ష్యాలకు చక్కటి రూపాన్ని ఇవ్వడంలో తల్లిదండ్రులే కీలకం. లక్ష్యాలు వాస్తవికతకు అద్దంపట్టేటట్లుగా ఉండాలే తప్ప అద్బుతంగా    ఉండకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి: