మావనజీవితంలో ఏదైనా మోతాదుకు మించితే ముప్పు తప్పదు. అది తిండైనా, నిద్రైనా, అలంకరమైన, మాట్లాడడమైనా, సొంత వైద్యం ఇలా ఏదైనా మోతాకు మించకుడదు. వీటిలో కొన్ని మన శరీర ఆకృతి, ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. మరికొన్ని ఎదుటి వారికి ఇబ్బంది కలిగిస్తాయి. అయితే ప్రతి ఒక్కరికీ నిద్ర చాలా అవసరం. ఎంత అవసరం అంటే ఆరోగ్యానికి మంచి చేసేంత. ఈ విషయం అందరికీ తెలిసిందే. అస‌లు విష‌యంలోకి వ‌స్తే.. మీరు ప్రతి రోజు ఎనిమిది గంటల కంటే ఎక్కువ సమయం నిద్రపోతున్నారా? అయితే మీ అలవాటును మార్చుకోవాల్సిందేనని పరిశోధకులు సూచిస్తున్నారు. 

 

ఎందుకంటే.. మనిషికి నిద్ర ఎంత అవసరమో.. అదే నిద్ర ఎక్కువైతే కూడా అంతే ప్రమాదం ఉంది. ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలనే కోరుకుంటారు. మరి అలా జీవించాలంటే శరీరానికి తిండి ఎంత అవసరమో, నిద్ర కూడా అంతే అవసరం అవుతుంది. మనిషి రోజుకు కనీసం 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవటం చాలా  అవసరం. కానీ.. 8 గంటలకు మించి నిద్రపోతే మొట్ట మొదటగా శరీరంపై ప్రభావం చూపుతుంది. దాంతో బరువు పెరుగుతారు. అధిక నిద్ర మీ బరువును పెంచుతుంది. 

 

ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల లేదా ప్రతి రోజూ రాత్రి సరిపడా నింద్రపొందలేకపోవడం వల్ల మధుమేహాన్ని పెంచే ప్రమాదం ఉంది. వారాంతంలో లేదా సెలవుల్లో నిద్రించే సమయం కంటే అధిక సమయం నిద్రపోవడం వల్ల కొందరికి అధిక తలనొప్పికి దారితీస్తుంది. అంతేకాదు ఎక్కువ సమయం నిద్రపోవడం వల్ల మెదడు దెబ్బతింటుంది, మొదడు సామర్థ్యం తగ్గుతుంది. అదే విధంగా ప్రతి రోజూ రాత్రి 7 నుంచి 8 గంటల సమయం నిద్రపోయే వారికంటే, 8 నుంచి 9 నిద్రపోయే వారిలో డెత్ రేట్స్ అధికంగా ఉన్నట్లు అధ్యనం వెల్ల‌డైంది. సో.. బీ కేర్‌ఫుల్‌..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: