జన్మనిచ్చిన తల్లిదండ్డ్రులను చూసుకోవలసిందిపోయి వారితో అడ్డమైన చాకిరీలు చేయించుకుంటున్నారు కొంత మంది. వాళ్లను పనిమనుషుల్లా చూస్తున్నారు. లేదా రోడ్డుపాలు చేస్తున్నారు. లేకపోతే ఆస్తులను తమ పేరున రాయించుకుని వాళ్లను ఓల్డేజ్ హోమ్ లో చేర్చుతున్నారు. 

 

పెద్దవాళ్లను గౌరవించకుండా, వాళ్ల బాగోగులు చూసుకోకుండా... నాటకాలాడుతున్నారు. ఇకపై అలాంటివాళ్లందరికీ జైల్లో చిప్పకూడు తప్పదు. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ సవరణ బిల్లుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో దీన్ని పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోతోంది. ఇకపై పెద్దవాళ్లను, ముసలివాళ్లను నిర్లక్ష్యం చేసినా, వాళ్లను పోషించకుండా తప్పించుకుంటున్నా, వాళ్ల సంరక్షణ బాధ్యతల్ని గాలికొదిలేసినా... అది నేరమే అవుతుంది. దీనిఫలింతంగా 5000 రూపాయల ఫైన్ కోర్టు విధిస్తుంది. లేదంటే 3నెలలు జైలు శిక్ష విధిస్తుంది. 

 

ఇంత జరిగినా తీరు మారకపోతే మళ్లీ కఠిన చర్యలు తప్పవు. ఇదివరకు ముసలి వాళ్లకు నెలకు 10000 రూపాయలు ఖర్చులకు డబ్బులు ఇవ్వాలని రూల్ ఉండేది. కాని ఇప్పుడు పిల్లలు ఎంత సంపాదిస్తే అందులో కొంత మొత్తం తల్లిదండ్లు పోషణ కోసం ఇవ్వాలని డిసైడ్ చేసారు. పోషణ, బట్టలు, ఆహారం, ఆరోగ్యం ఇలాంటి మెయింటెనెన్స్ పిల్లలు చూసుకోవాలి. 


కేంద్రం తెస్తున్న సవరణల బిల్లు చాలా బాధ్యతల్ని పిల్లలపై పెట్టింది. ఇక నుండి తమ తల్లిదండ్రులకు ఏం కావాలో అన్ని పిల్లలే చూసుకోవాలి .. లేదంటే శిక్షలు పడే అవకాశం ఉంది. దీన్ని దృష్టలో పెట్టుకుని కొడుకులు, కూతుళ్లుతమ పెద్దలపై ఉన్న తమ భాధ్యతను సక్రమంగా నిర్వహించాల్సి ఉంటుంది. 

 

ఇండియా లాంటి దేశంలో ఇలాంటి చట్టాలు అమలవుతున్నది తక్కువే. కానీ... కేంద్రం దీనిపై చాలా సీరియస్‌గా ఉందని తెలిసింది. కచ్చితంగా అమలు చెయ్యాలనీ, పెద్దోళ్లను పట్టించుకోని వాళ్లను వదిలే ప్రసక్తే ఉండకూడదని నిర్ణయించినట్లు తెలిసింది. అందువల్ల పెద్దోళ్లు తమకు అన్యాయం జరుగుతోందని అనిపిస్తే... కోర్టుకు వెళ్లి న్యాయం పొందడమే కాదు... పిల్లల్ని, అల్లుళ్లు, కోడళ్లను కూడా దారికి తెచ్చుకోగలరు. కెంద్రం తెచ్చిన చట్టంతో నైనా ముసలివాళ్లకు ఇక కష్టంతో బ్రతకాల్సిన అవసరం ఉడదనే ఆశిద్దాం.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: