ప్ర‌స్తుత స‌మాజంలో అధిక బ‌రువుతో చాలా మంది ఇబ్బంది ప‌డుతున్నారు. ఎక్కువగా యంగ్ ఏజ్ లో చాలామంది ఒత్తిడికి గురువుతూ ఉంటారు. దీంతో తినే తిండిపై శ్రద్ధ పెట్టరు. ఫలితంగా అధిక బరువు లేక ఊబకాయం వస్తుంది. దీంతో శరీరంలో ఉండే అదనపు కొవ్వు పదార్థాలను, అధిక బరువును తగ్గించుకోవడానికి చాలామంది నానా ఇబ్బందులుపడుతుంటారు. ఎక్సర్‌సైజులు, డైటింగులతో ఒళ్లు హూనం అయ్యేలా కష్టపడుతున్నా ఫ‌లితం లేక‌పోవ‌డం మ‌రింత ఒత్తిడికి గుర‌వుతుంటారు. అయితే లావును తగ్గించుకోవడానికి ఎలాంటి మ్యాజిక్ లు ఉండవు.

 

వాస్త‌వానికి చాలా చిన్న చిన్న నియమాలు పాటిస్తే బరువు సులువుగా తగ్గించేసుకొవచ్చు. అవేంటంటే కొన్ని పదార్దాలు మీ ఆహార భాగంలో చేర్చుకుంటే స‌రిపోతంది. అందులో ముఖ్యంగా అల్లం బరువును తగ్గించడంలో  బాగా పని చేస్తుంది. మీరు వెంటనే బరువు తగ్గాలంటే కచ్చితంగా రోజూ మీరూ తినే ఆహారాల్లో అల్లం ఉండేలా చూసుకోండి. మ‌రియు కొబ్బరి నూనె శరీర బరువును తగ్గించుటలో శక్తివంతంగా పని చేస్తుంది. బరువు తగ్గించుకోవాలనుకునే వారు వారు తినే ఆహార పదార్థాల తయారీలో కొబ్బరి నూనె వాడడం చాలా మంచిది.

 

అలాగే బరువును తగ్గిచడంలో దాల్చిన చెక్క బాగా పని చేస్తుంది. రోజూ ఉదయం మీరు తాగే కాఫీ లేదా టీ కాస్త దాల్చినచెక్కను కలుపుకుని తాగితే మేలు. దీంతో మీరూ త్వరగా బరువు తగ్గొచ్చు. శరీరంలో కొవ్వును వేగవంతంగా కరిగించడంలో చిరుధాన్యాలు ప్రముఖపాత్ర వహిస్తాయి.కాబట్టి రాగులు,సజ్జలు, జొన్నిలు ఇలంటి మీ డైట్‌లో చేర్చుకోండి. కొవ్వు కరిగించే అద్భుత ఆహార పదార్థాలుగా ద్రాక్షపండ్లని చెప్పవచ్చు. ఇది జీవక్రిను పెంచి మరియు శరీరంలో అదనంగా ఉండే కొవ్వు పదార్థాలు కరిగేలా చేస్తుంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: