హిందూ సాంప్రదాయంలో పాటించే పద్దతులలో ప్రతీది సైన్స్ కు సంబంధం ఉంటుంది. హిందూమతం అనేది ఒక మర్మమైన మతం. అనేక ఆచారాలు,సంప్రదాయములు,విశ్వాసాలు చాలా పటిష్టంగా ఉంటాయి. అయితే మనం దరించే ప్రతి వస్తువు మనకు ఆరోగ్యంతో పాటు వికాసాన్ని అందిస్తుంది. మ‌రియు హిందూ సాంప్ర‌దాయంలో దేవాల‌యాల‌కు వెళ్ల‌డం, దేవుళ్ల‌కు, దేవ‌త‌ల‌కు మొక్కుకోవడం, వీలైతే అర్చ‌నో, పూజో చేయించుకోవ‌డం, హుండీలో ఎంతో కొంత వేసి త‌మ కోర్కెల‌ను తీర్చాల‌ని భ‌గ‌వంతున్ని ప్రార్థించ‌డం భ‌క్తుల‌కు అలవాటే. ఇక ప్ర‌ధానంగా దేవుళ్ల‌కు పూజ చేసే విష‌యానికి వ‌స్తే దీపం, అగ‌ర్‌బ‌త్తి వెలిగించడం, క‌ర్పూరంతో హార‌తి ఇవ్వ‌డం మామూలే.

 

అయితే క‌ర్పూరంతోనే హార‌టి ఎందుకు ఇస్తారో తెలుసా..? దీనికి ఓ సైంటిఫిక్ రీజ‌న్ ఉందండోయ్‌..! స‌హ‌జంగా హార‌తిలా క‌ర్పూరాన్ని వెలిగించి దాంతో దేవుడికి హార‌తి ఇస్తారు. ఆ స‌మయంలో పొగ ఎక్కువే వ‌స్తుంది. అయితే అలా వ‌చ్చే పొగ‌ను పీల్చ‌డం వ‌ల్ల మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి. ఆ పొగ పీల్చ‌డం వ‌ల్ల ఆస్త‌మా, టైఫాయిడ్‌, త‌ట్టు, ఆందోళ‌న‌, త‌త్త‌ర‌పాటు, హిస్టీరియా, కీళ్ల నొప్పులు వంటి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ట‌. 

 

అదే విధంగా క‌ర్పూరం పొగ వ‌ల్ల జ్ఞాప‌క‌శ‌క్తి వృద్ధి చెందుతుంద‌ట‌. చ‌ర్మ సంబంధ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయ‌ట‌. క‌ర్పూరాన్ని వెలిగిస్తే అది ఎలాగైతే పూర్తిగా మండిపోతుందో అలాగే దానికి ఎదురుగా నిల‌బ‌డి పూజ చేసిన వారిలో ఉన్న స్వార్థం, చెడు కూడా అలాగే మండిపోతుంద‌ని అంటున్నారు. మ‌రియు ఆ పొగ వ‌ల్ల చుట్టూ వాతావ‌ర‌ణంలో ఉండే బాక్టీరియా, క్రిములు, వైర‌స్‌లు ఈజీగా నాశ‌న‌మ‌వుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: