ఊబకాయం.. ఇప్పుడు చాలామందిని వేధిస్తున్న సమస్య ఇది. మారుతున్న జీవన శైలి కారణంగా శారీరక శ్రమ తక్కువై.. జంక్ ఫుడ్స్ కారణంగా జనం బాగా లావుగా మారుతున్నారు. మరి ఈ లావు సమస్య సెక్స్ పై ఎలాంటి ప్రభావం చూపుతుంది. లావుగా ఉంటే సెక్స్ కోరికలు తగ్గుతాయా.. లావు సమస్య వల్ల భాగస్వామి సెక్స్ పట్ల ఆసక్తి కోల్పోతారా.. తెలుసుకుందాం..

 

కొంతమంది పెళ్లయ్యాక బాగా లావవుతారు. బరువు పెరిగిన తర్వాత లైంగిక వాంఛలు కూడా క్రమంగా తగ్గిపోయాయి. తన రూపం తనకే నచ్చట్లేదనీ, అధిక బరువు కారణంగానే తనకు ఆసక్తి సన్నగిల్లిందని అంటుంటారు కూడా. అంతే కాదు లావు కారణంగా ఎప్పుడూ నిరాశగా, నిరాసక్తంగా కనిపిస్తుంటారు.

 

అయితే వాస్తవానికి లావు కారణంగా. తన రూపం మీద ఏర్పడిన అనిష్టాన్ని పోగొట్టుకుంటే కొంత వరకూ సమస్య పరిష్కారం అవుతుంది. అంతే కాదు.. లావుగా ఉన్నానని బాధపడటం డిప్రెషన్‌లో ఇదొక కోణం. దీని వల్లే ఇంకా లావు పెరుగుతారు. లైంగికాసక్తి కోల్పోవటం జరిగింది.

 

దీనిపరిష్కారం కోసం భార్యాభర్తలిద్దరూ ప్రయత్నించాలి. ఇద్దరూ కలిసి వాకింగ్‌కి వెళ్లాలి. లేదా ఈత, జాగింగ్‌, ఆటలు లాంటి శారీరక శ్రమతో కూడుకున్న వ్యాయామాల్లో పాల్గొనాలి. చక్కెర, నూనెలు ఉండే పదార్థాలు కొనటం మానేయాలి. ఆరోగ్యకరమైన ఆహారంతో ఫ్రిజ్‌ నింపేయాలి.

 

ఇక సెక్స్‌ విషయానికొస్తే పెనట్రేటివ్‌ సెక్స్‌కు బదులుగా ఫోర్‌ప్లేతో కూడా మీరు సంతోషంగా ఉండగలరని చెప్పి, ఆయనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచాలి. దంపతులు ఒకర్నొకరు అర్థం చేసుకుని, ఇచ్చిపుచ్చుకునే ధోరణి కలిగి ఉండటం లైంగిక జీవితంలో అత్యవసరం. ఇలా కొంతకాలంపాటు జీవనశైలిని మార్చుకోగలిగితే క్రమంగా మార్పు వస్తుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: