వయసు పైబడి, వృద్ధాప్యం దగ్గర పడుతుండటం వల్ల మన చర్మం & కళ్ళ దగ్గర సంభవించే వృద్ధాప్య సంకేతాలను మనం ఏవిధంగాను అడ్డుకోలేము. వృద్ధాప్యాన్ని నివారించడం సాధ్యం కాకపోయినా దానిని ఆలస్యం చేయడం సాధ్యమే. వయసు పై బడుతున్న ప్రతి వ్యక్తి యవ్వనంగా కనిపించాలని ఆరాటపడుతుంటాడు. వయసుతో పాటు వచ్చే శారీరక మార్పులను అస్సలు అంగీకరించరు. యవ్వనంగా కనిపించడానికి అనేక నూతన మార్గాలను అణ్వేషిస్తుంటాడు మానవుడు. అయితే ప‌లు ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తింటే వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా వ‌స్తాయ‌ట‌. 

 

మ‌నం జీవించడానికి పోష‌కాల‌తో కూడిన మంచి ఆహారం ఎంత అవ‌స‌ర‌మో, అదే క్ర‌మంలో మ‌న‌కు శ‌రీరానికి చెడు చేసే ఆహార ప‌దార్థాలు కూడా ఉంటాయి. అవి మ‌న‌కు త్వ‌ర‌గా వృద్ధాప్యాన్ని తెచ్చి పెడ‌తాయి. కాబ‌ట్టి వాటిని వీలైనంత వ‌ర‌కు తీసుకోకుండా ఉండ‌డ‌మే బెటర్. మ‌రి అవేంటో ఓ లుక్కేసేయండి. పిండిప‌దార్థాల‌ను త‌క్కువ‌గా, ఫైబ‌ర్‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. పిండిప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకుంటే క‌ణాలు త్వ‌ర‌గా వృద్ధాప్య ద‌శ‌కు వ‌చ్చేస్తాయి. మ‌రియు కారం ఎక్కువ‌గా ఉన్న ఆహార ప‌దార్థాల‌ను తిన్నా వృద్ధాప్య ఛాయ‌లు త్వ‌ర‌గా వ‌చ్చేస్తాయి. 

 

ఎందుకంటే కారంలోని ప‌దార్థాలు మ‌న శ‌రీరంలోని ఎర్ర ర‌క్త క‌ణాల‌పై ప్ర‌భావం చూపిస్తాయి. దీంతో చ‌ర్మం త‌న స‌హ‌జ కాంతిని కోల్పోతుంది. వృద్ధాప్య ఛాయ‌లు వ‌చ్చేస్తాయి. అలాగే స్వీట్లు చాలా మందికి ఇష్ట‌మే. కానీ వీటి వ‌ల్ల దేహంలో గ్లెకేష‌న్ అనే ప్రక్రియ  స్టార్ట్ అయి, అది ప్రోటీన్ల‌ను గ్ర‌హించ‌కుండా చేస్తుంది. దీంతో క‌ణాలు త్వ‌ర‌గా బ‌ల‌హీన ప‌డి వృద్ధాప్యం వ‌స్తుంది. ఇక కాఫీల‌ను కూడా ఎక్కువ‌గా తాగ‌కూడ‌దు. లేదంటే చ‌ర్మం పొడిబారిపోయి త్వ‌ర‌గా ముడ‌త‌లు ప‌డుతుంది. వృద్ధాప్యాన్ని పూర్తిగా దూరం చేయలేక పోయినా, వృద్యాప్యం అంత తొందరగా శరీరం మీద ప్రభావం చూపకుండా కాస్త ఆలస్యంగా వచ్చేందుకైనా ప్ర‌య‌త్నించాలి క‌దా..!

 

మరింత సమాచారం తెలుసుకోండి: