దేవుడు తర్వాత వైద్యుడినే దేవుడని అంటారు.. దండం కూడా దేవుడి తర్వాత వైద్యుడికే పెడతారు. ఎందుకంటే ప్రాణాలు నిలబెడతాడు అని.. కాని కలకత్తా లోని ఒక డాక్టర్ కి మాత్రం ఒక చెడు అనుభవం ఎదురయింది..


ఎప్పుడయినా ఎవరికయినా జబ్బు చేసింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నా కాపాడమని ఫోన్ చేసి ఇంటికి రమ్మంటే జరా భద్రం గా ఉండండి. మల్లా అదే నెంబర్ నుండి ఫోన్ కాల్ వస్తుంది. మీ డబ్బు అంతా గుల్ల అవుతుంది. ఆరోగ్యం బాలేదని ఫోన్ చేసి రమ్మంటే వెళ్లిన మాత్రాన డబ్బులు ఎలా పోతాయి అనుకుంటున్నారా?

అసలు వివరాలలోకి వెళితే... కొలకత్తా లోని డం డం ప్రాతంలో నివాసముంటున్న ఒక మహిళ  అక్కడే డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్న ఒక కాశ్మిరీ డాక్టర్ కి ఫోన్ చేసి గుండెనొప్పి గా ఉంది... హాస్పిటల్ కి రాలేను దయవుంచి నేను చెప్పిన అడ్రెస్స్ కి వచ్చి నన్ను బతికించండి అని ప్రాధేయపడింది ఫోన్ లో.. డాక్టర్ అంటే దేవుడితో సమానం కదా అని పాపం ఆ డాక్టర్ మహిళ చెప్పిన అడ్రస్  గల ఇంటికి వెళ్ళాడు.


ఇంటికి వెళ్ళాక ఆ మహిళ దగ్గర ఉన్న పాత రిపోర్ట్స్ ని చూస్తున్నాడు.. అంతే వెనకనుంచి నలుగురు పోలీసులమంటూ వచ్చి డాక్టర్ ని ప్రశ్నించడం మొదలుపెట్టారు... .ఇక్కడ ఈ మహిళతో నువ్వు ఏమి చేస్తున్నావ్ అని ప్రశ్నించారు. గుండెనొప్పి అని ఫోన్ చేస్తే వచ్చాను అని చెప్పాడు డాక్టర్. కాని ఇది నమ్మశక్యంగా లేదని పోలీసులు డాక్టర్ ని 'బట్టలు విప్పమని నగ్నం గా నుంచోమని' బెదిరించారు.

దీనితో భయం తో బట్టలు విప్పేసాడు. పోలీసులు ఫొటోస్ తీసుకున్నారు...
అసలు పోలీసులు ఇలా బట్టలు విప్పమనడం ఏంటి అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలు మోసం అంతా !!!అసలు ఆ నలుగురు పోలీసులే కాదు.. పోలీస్ డ్రెస్ లో ఉన్నా డమ్మీ పోలీసులు. ఆ ఫోన్ చేసిన మహిళా కూడా మోసగత్తె.. వీళ్లంతా ఒక గ్యాంగ్.. ఒక ప్లాన్ ప్రకారం ఇలా డాక్టర్ ని ఇంటికి రప్పించారు..


డాక్టర్ ఫొటోస్ చూపించి 10 లక్షలు ఇస్తావా లేక ఇంటర్నెట్ లో పెట్టమంటావా ఫొటోస్ అని బెదిరించారు. డాక్టర్ చేసేది లేక తన దగ్గర ఉన్నా 5,15,000 లక్షల రూపాయిలు ఇచ్చాడు. అంతేకాక 5 లక్షలు విలువచేసే తన భార్య నగలు కూడా వాళ్ళకి ఇచ్చాడు. అవి తీసుకుని అక్కడినుంచి పరారయ్యారు.. షాక్ నుంచి తేరుకుని పోలీసులకి జరిగినదంతా చెప్పాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు ను దర్యాప్తు చేసి  ఆ గ్యాంగ్ ని కటకటాల్లోకి పంపారు. ప్రస్తుతం వీళ్ళు బెయిల్ మీద బయటకి వచ్చారు... డాక్టర్స్ జరా జాగ్రత్తగా ఉండండి... 

మరింత సమాచారం తెలుసుకోండి: