సాధార‌ణంగా చాలా మందికి మార్నింగ్ టీ తాగ‌నిదే రోజు గ‌డ‌వ‌దు. మ‌రికొంద‌రికి ఉదయం లేవగానే కాఫీ తాగకపోతే ఏ పని చేయలేం అన్నంతాగా ఫీల‌వుతారు. వాస్త‌వానికి చల్లని వాతావరణంలో వేడి వేడిగా కాఫీ లేదా కలుపుకుని తాగితే వచ్చే మజాయే వేరు కదా. వేడి వేడి టీ లేదా కాఫీ గొంతు నుంచి దిగుతుంటే కలిగే హాయి మాటల్లో చెప్పలేం. అయితే టీ,కాఫీలు తాగడం వల్ల చాలా నష్టాలున్నాయన్న వార్తలు చాలనే విన్నాం. దీంతో టీకి దూరంగా ఉండెందుకు చాలామంది ప్రయత్నిస్తుంటారు. తాజాగా కొన్ని పరిశోధనల్లో రోజు టీ తాగితే 108 సంవత్సరాలు జీవించవచ్చని తేలింది. ఇదిలా ఉంటే అస‌లు టీ బెట‌రా..? లేదా కాఫీ బెట‌రా..? అన్న ప్రశ్న‌లు రాక మానవు.

 

అయితే డ‌యాబెటిస్‌, గుండె జ‌బ్బులు, క్యాన్స‌ర్ వంటి వ్యాధులు ఉన్న‌వారు.. ఇత‌ర అనారోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌వారు నిత్యం కాఫీ తాగితే మంచిది.  అలాగే ఉద‌యాన్నే ప‌ని భారం ఎక్కువ‌గా ఉంటుంద‌ని అనుకునే వారు కాఫీ తాగితే మైండ్ రిలాక్స్ అయి మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. ఒత్తిడి సమయంలో ఓ కప్పు టీ తాగితే ఉపశమనం ఉంటుంది. అలాగే తలనొప్పిగా ఉన్న సమయంలో కూడా టీ చక్కగా పనిచేస్తుంది. అలాగే అసిడిటీ, జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు టీ తాగాలి. 

 

అయితే టీ, కాఫీ రెండింటి ద్వారా మ‌న‌కు ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు క‌లిగిన‌ప్ప‌టికీ వాటిని నిత్యం ప‌రిమిత మోతాదులో మాత్ర‌మే తీసుకోవాలి. అదే విధంగా టీ, కాఫీల‌లో కెఫీన్ అనే స‌మ్మేళ‌నం ఉంటుంద‌ని తెలిసిందే. అయితే టీ క‌న్నా కాఫీలోనే ఎక్కువ‌గా కెఫీన్ ఉంటుంది. ఈ క్ర‌మంలో నిత్యం మ‌నం 400 మిల్లీగ్రాముల క‌న్నా ఎక్కువ‌గా కెఫీన్ తీసుకోరాదు.అంటే కాఫీ అయినా టీ అయినా స‌రే.. ఎన్ని క‌ప్పులు తాగినా వాటి ద్వారా మ‌న‌కు అందే కెఫీన్ ప‌రిమాణం నిత్యం 400 మిల్లీగ్రాముల‌కు మించ‌రాదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: