ఒక విధముగా చెడిపోయిన ఆహారం తిన్న 45మంది విద్యార్ధినులు రాత్రికి రాత్రి అందరికీ  వాంతులు, విరేచనాలు మొదలయ్యాయి. కొంచెము పాడైన ఆహారం తీసుకున్న విద్యార్థులు అందరూ అస్వస్థతకు లోనై ఆస్పత్రి పాలవ్వడం జరిగింది. పార్వతీపురం మండలం కవిటిభద్ర కేజీబీవీ పాఠశాల వసతిగృహంలో ఇటీవల  విద్యార్థులందరికీ భోజనం వడ్డించారు. వడ్డించగా మిగిలిన కూరలు, పెరుగు రాత్రి వేళ కూడా విద్యార్థినులకు, పాడైపోతాయి అన్న ఉద్దేశ్యంతో  బలవంతంగా వడ్డించడంతో గత్యంతరం లేక అందరూ ఉన్నారు. వాటిని తిన్న వారంతా అనారోగ్యం బారిన పడ్డారు అంటే. మొత్తం 165మంది విద్యార్థినులలో 45మందికి విరేచనాలు, వాంతులు ఒక్కసారిగా ప్రారంభం కావడం జరిగినది. అప్పుడు హుటాహుటిన అందుబాటులో ఉన్న ఏఎన్‌ఎం ప్రాథమిక చికిత్స అందించింది. పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి పూర్తి చికిత్సకోసం 45 మంది విద్యార్థులను తరలించారు. అనారోగ్యం పాలైనవారిలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నవిద్యార్థులు.

 

ఇలా జరగడంతో వెంటనే పాఠశాల యొక్కస్పెషల్‌ అధికారిని పి.వరలక్ష్మి, వారిసిబ్బంది అంతా హుటాహుటిన వారిని రాత్రికి రాత్రి ఆస్పత్రిలో చేర్పించి అత్యవసర చికిత్సను ఇప్పించారు.స్పెషల్ అధికారిని పి.వరలక్ష్మి ఆస్పత్రిలో అక్కడే ఉండి అన్ని పరిశీలించడం జరిగింది అన్నారు. ఈ విషయం తెలుసుకున్న జాయింట్‌ కలెక్టర్‌–2 ఆర్‌.కూర్మనాథ్, జిల్లా విద్యాశాఖాధికారి జి.నాగమణి  ఏరియా ఆస్పత్రిని సందర్శించి సంఘటనపై దర్యాప్తు చేయడం జరిగింది.

 

   మధ్యాహ్నం వడ్డించగా మిగిలి పోయిన పెరుగు వేసుకునేందుకు పిల్లలు వద్దు అన్నారు. కానీ ఊరికే వృథా అవుతుందన్న కారణంతో అక్కడ ఉన్న సిబ్బంది బలవంతంగా పిల్లలచే తినిపించారు. అదే వారి కొంప ముంచు తుంది అని ఊహించలేదు. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డా.వాగ్దేవి ఆధ్వర్యంలో వైద్యబృందం విద్యార్థి నులకు తక్షణ వైద్యసేవలు అందించడంతో పెను ప్రమాదం తప్పింది అనే అనుకోవాలి.   ఇక  నుంచి ఇలాంటి పరిణామాలు ఎదురైతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించడం జరిగింది . పాఠశాలకు వెళ్లి విద్యార్థులు,  ఉపాధ్యాయులతో సమావేశమై పూర్తిస్థాయి విచారణ కూడా చేయడం జరిగింది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: