చలి తీవ్రత క్రమేపీ పెరుగుతోంది. చలికాలం చాలావరకూ వ్యాధులను వెంట తీసుకొచ్చేకాలం. తగ్గిపోతున్న ఉష్ణోగ్రత వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వెంటాడుతుంటాయి. దానికి తోడు వాతావరణ కాలుష్యం. దీంతో చిన్నా, పెద్ద అన్న తేడా లేకుండా అందరూ జలుబు, దగ్గు, జ్వరాలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చలి వల్ల జలుబు, ఛాతీ, ఊపిరితిత్తుల బాధలు ఎక్కువవుతున్నాయి. అయితే ఇవి అంతగా ప్రాణాంతకమైతే కావు. కొంచెం జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వీటిని సులభంగానే అధిగమించవచ్చు. చలిగాలుల వేళ శరీరానికి వేడిని అందించే ఆహార పదార్థాలను తీసుకుంటే ఎంతో ఉపశమనంగా ఉంటుంది.

 

ముఖ్యంగా చిరుధాన్యాలు, ఆకుకూరలను ఆహారంగా తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరిగి, ఎలాంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తకుండా ఉంటాయి. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా దుస్తులు వేసుకుంటే మంచిది. మైదాపిండితో చేసిన బ్రెడ్‌, బిస్కట్లు లాంటివి తినకుండా ఉంటే మంచిది. మ‌రియు ప్రోసెస్డ్‌ ఫుడ్స్‌, చీజ్‌, నిలువ పచ్చళ్లకు దూరం ఉండాలి.రాత్రివేళల్లో చల్లని పదార్థాలు తిన‌డం అంత మంచిది కాదు.

 

అదే విధంగా.. ఉల్లిపాయరసంలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగినా లేదా పచ్చిఉల్లిపాయమీద నిమ్మరసం పిండుకుని తిన్నా ఊపిరితిత్తుల్లో చేరిన శ్లేష్మం కరిగిపోతుంది. గోరువెచ్చగా ఉండే ఫ్లూయిడ్లు తీసుకుంటే శరీరానికి ఎంతో సాంత్వనగా ఉంటుంది. వేడి ద్రవపదార్థాలు తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లో చేరిన నెమ్ము కరుగుతుంది.వెల్లుల్లి లేదా అల్లం వేసి తయారుచేసిన కాయగూరల సూప్‌ను వేడిగా తాగితే మంచిది. సో.. త‌ప్ప‌కుండా ఈ ట్రిక్స్‌ను ట్రై చేయండి..!

మరింత సమాచారం తెలుసుకోండి: