కొత్తిమీర సాధారణంగా దీనిని రుచికోసం ఆహార తయారీలలో వాడుతూ ఉంటాము.  కానీ కొత్తిమీర వలన రుచి మాత్రమే కాకుండా చాలా రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఇక  ప్రతి రిఫ్రిజిరేటర్ లో కొత్తిమీర ఒక ప్రత్యేక స్థానం కలిగి ఉంటుంది. కొత్తిమీర అత్యధిక వంటకాల్లో ఉపయోగించే ఒక శక్తివంతమైన హెర్బ్ మరియు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది. నిజానికి కొత్తిమీర‌ను కొన్ని వేల సంవ‌త్స‌రాల కింద‌టే వినియోగంలోకి తెచ్చారు. అయితే కిత్తిమీర‌లో పోషకాలు మ‌న‌కు పూర్తిగా అందాలంటే.. కూర వండిన తర్వాతే కొత్తిమీర దానిపై చల్లాలి. 

 

అంతే తప్పకూర వండుతున్నప్పుడు కొత్తిమీరను అందులో వేస్తే.. ఆ ఆకులు అతి వేడికి ఉడికిపోయి వాటిలో పోషకాలు ఆవిరి రూపంలో బయటకు పోతాయి.  మ‌రియు జీర్ణ స‌మ‌స్య‌ల‌ను నివారించ‌డంలో కొత్తిమీర అద్భుతంగా ప‌నిచేస్తుంది. కొత్తిమీర జ్యూస్‌ను ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే తాగితే జీర్ణ స‌మ‌స్య‌లైన గ్యాస్‌, అసిడిటీ, మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతాయి. కొత్తిమీర చాలా యాంటీ-ఆక్సిడేంట్స్'ని కలిగి ఉండటము వలన ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరంలోని కొవ్వు పదార్థాల స్థాయిలను సమన్వయ పరుస్తుంది. కొత్తిమీర ఆకులు హానికరమైన కొవ్వు పదార్థాలను తగ్గించి, ఆరోగ్యకరమైన కొవ్వు పదార్థాల స్థాయిలను పెంచుతుంది.

 

అలాగే గుండె సంబంధిత జబ్బులు రాకుండా కొత్తిమీర కాపాడుతోంది. హైబీపీని కంట్రోల్‌లో ఉంచుతూ, కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని క్రమబద్ధీకరిస్తుంది. బాడీలో అధికంగా ఉండే సోడియంను బయటకు పంపేస్తుంది. ముఖ్యంగా కొత్తిమీర మధుమేహం తగ్గించటంలో ఉపయోగపడుతుంది. కిడ్నీ స్టోన్ నివారిస్తుంది, అదే విధంగా పిల్లలు మరియు పెద్దల్లో యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ ను కూడా నివారిస్తుంది. అలా అని ఓవ‌ర్‌గా మాత్రం కొత్తిమీర‌ను వాడ‌కుడ‌దు. ఏదైనా ప‌రిమితికి మించితే అన‌ర్థ‌మే. సో.. కొత్తిమీర‌ను లిమిట్‌గా ఉప‌యోగిస్తే అనేక అరోగ్య ప్ర‌యోజ‌నాలు పొందొచ్చు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: