ముసలోడే కానీ ఆ కోరికలు ఇంకా తీరలేదు. ఒక మోస్తరు వయసు ఉన్న వాళ్ళు కూడా సరిపోరట అందుకే కుర్ర అమ్మాయిలతో ఆ కోరికలు తీర్చుకోవాలని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వేటని మొదలు పెట్టాడు. ఈ క్రమంలోనే ఓ అమ్మాయి నుంచీ కాల్ వచ్చింది. మెల్లగా మాటలు కలిపింది. తానొక డేటింగ్ సెంటర్ నడుపుతున్నట్టుగా తెలిపింది. అందులో మెంబర్ షిప్ తీసుకుంటే మీకు నచ్చిన కుర్ర అమ్మాయిలతో మీరు అనుకున్న విధంగా సుఖపడచ్చు అంటూ కబుర్లు చెప్పింది.

 

అసలే కట్టలు తెంచుకునే కోరికలు మీద ఉన్న ముసలోడు సరే అన్నాడు. మెంబర్ షిప్ కోసం భారీగా డబ్బు వసూలు చేసింది. మెంబెర్ గా చేరినా ఇంకా తన వద్దకి అమ్మాయిలని పంపడం లేదు ఎందుకు అంటూ నిలదీయడం మొదలు పెట్టాడు ముసలాయన. పోలీసులకి ఫిర్యాదు చేస్తా అంటూ బెదిరించాడు. దాంతో చిర్రెత్తుకొచ్చిన ఆమె రివర్స్ లో అతడిపై కేసు వేసినట్లుగా నోటీసులు పంపింది.

 

ఆ నోటీసుకు చూసిన ముసలాయన కంగారు పడ్డాడు. పోలీసులు తన అరెస్ట్ చేస్తే తన పరువు పోతుందని భయపడ్డాడు. వెంటనే ఆమె చెప్పినట్లుగా చేయడం మొదలు పెట్టాడు. ఇలా అప్పుడప్పుడు బెదిరిస్తూ ఆమె ఆ ముసలాయన నుంచీ సుమారు 73 లక్షల సొత్తు కాజేసింది. ఇంకా ఇవ్వమని బెదిరింపులు చేయడంతో ఇక చేసింది లేక పోలీసులని ఆశ్ర్రయించాడు. ఆమె ఫోన్ నెంబర్ ట్రాప్ చేసిన పోలీసులు 25 ఏళ్ళ వయసు ఉన్న ఓ అమ్మాయిని, 35 ఏళ్ళ వయసు ఉన్న ఓ మహిళని అరెస్ట్ చేశారు. ఈ ఘటన  ముంబై లో జరిగింది. ముసలాయన అభ్యర్ధన మేరకు ఆయన వివరాలు వెల్లడించలేదు పోలీసులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: