సాధార‌ణంగా కాఫీ అంటే చాలా మంది అమితమైన ఇష్టం. ఉదయం లేవగానే వేడి వేడి కాఫీ తాగితే కానీ ఉల్లాసంగా అనిపించదు చాలా మందికి. కేవ‌లం ఉదయమేనా.. బద్ధకంగా అనిపించినప్పుడు, తలనొప్పి వచ్చినప్పుడు, పని ఒత్తిడిలో ఉన్నప్పుడు.. ఇలా పలు సందర్భాలలో కాఫీ తాగి వెంటనే ఉల్లాసాన్ని పొందుతుంటారు. ఇక ఆఫీసులో హెవీ వర్క్‌తో అలసిపోయి ఉంటే ఓ కప్పు కాఫీ తాగుతాం. దీంతో తిరిగి ఎనర్జీ పొంది మళ్లీ పనిలోకి దిగిపోతాం. కాఫీ తాగితే అదేదో రిలాక్స్ అయినట్లుగా ఉంటుంది చాలా మందికి. అయితే కాఫీ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి కొంత మేలు ఉంటే కొంత చెడు కూడా కలుగుతుందని కొన్ని పరిశోధనలు తేల్చాయి.

 

ఇక వరుసగా రోజుల తరబడి కాఫీలు తాగే వారికి మేలులు ఎన్ని ఉన్నాయో దానివల్ల కీడు కూడా అంతే స్థాయిలో ఉన్నట్లు విశ్లేషించారు. అంటే కెఫీన్ తలనొప్పికి మందుగా పనిచేయడమే కాదు కొత్తగా మైగ్రేన్‌ను కూడా తీసుకువచ్చే అవకాశాలున్నట్లు తేల్చారు. అలాగే ముఖ్యంగా గర్భంతో ఉన్నవారు కాఫీ ఎక్కువగా తాగడం హానికరమని కూడా నివేదిక తేల్చింది. స్ట్రోక్ నివారిస్తుంది హార్ట్ స్ట్రోక్ వంటి హార్ట్ ప్రాబ్లెమ్స్ ను కాఫీ తగ్గిస్తుంది. కాఫీ వల్ల ఇది ఒక ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం పొందవచ్చు.

 

అలా అని ఆరు కప్పుల కంటే ఎక్కువగా కాఫీ తాగితే ఆరోగ్యానికి హానికరమని దీని వల్ల గుండెజబ్బులు పెరిగే అవకాశం 22శాతం అధికంగా ఉంటుందని కూడా ప‌రిశోధ‌న‌లో తేలింది. రిఫ్రెషింగ్‌గా ఉంది కదా అని కప్పులకు కప్పులు లాగిస్తే మన ప్రాణాలు మన చేతులో లేనట్లే లెక్క. అలాగే కాఫీ తాగే వాళ్లకు కాలేయ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువని ఈ నివేదిక తెలిపింది. అయితే దానికి కాఫీయే కారణమని మాత్రం నిరూపణ కాలేదు. సో.. లిమిట్‌గా కాఫీ తీసుకుంటే ఎలాంటి ప్ర‌మాదం ఉండ‌దు. 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: