సాధార‌ణంగా కొబ్బ‌రి నూనె జుట్టుకు పెట్టుకుంటారు. అయితే కొబ్బ‌రి నూనె కేవ‌లం జుట్టుకు మాత్రంమే కాదు.. బాడీ లోషన్‌గా, టోనర్‌గా కూడా కొబ్బరి నూనెను వాడొచ్చు. దీనిలోని యాంటీ-వైరల్‌, యాంటీ- బ్యాక్టీరియల్‌ గుణాలు జలుబు, జ్వరం వంటి చిన్నచిన్న అనారోగ్యాలను కూడా నివారిస్తాయి. మ‌రియు కేర‌ళ ప్ర‌జ‌లు కొబ్బ‌రి నూనెతో వంట‌లు చేసుకుంటారు. వీరి ఆరోగ్యం వెనుక ఉన్న సీక్రెట్ ఇదే. అంతేకాదండోయ్.. కొబ్బరి నూనె వల్ల గుండెకు మేలు చేసే మంచి కొవ్వు కూడా పెరుగుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

 

ఉదరంపై కొబ్బరినూనెతో మసాజ్ చేసుకోవడం వల్ల కంటిచూపు మెరుగవుతుంది. అందువల్ల మీరు ఇలా అప్పడప్పుడు కొబ్బరి నూనెను అక్కడ పూసుకుంటూ ఉండండి. కంటి చూపునకు సంబంధించిన సమస్యలు తలెత్తవు. ప్రయాణ సమయంలో కొబ్బరి నూనెను రకరకాలుగా వాడుకోవచ్చు. ఇది క్లీన్సర్‌, మాయిశ్చరైజర్‌, హెయిర్‌ కండీషనర్‌, బాడీ లోషన్‌గా ఉపయోగపడుతుంది. వంటలో టేబుల్‌ స్పూను కొబ్బరినూనె వేయాలి. దీంతో గర్భిణుల్లో కనిపించే మార్నింగ్‌ సిక్‌నెస్‌, వికారం వంటివి తగ్గుతాయి. ఇక మగవాళ్లు షేవింగ్‌ తరువాత కొబ్బరి నూనె రాసుకుంటే దద్దుర్లు, మచ్చలు ఏర్పడవు.

 

సహజ పద్ధతుల్లో బరువు తగ్గేందుకు కొబ్బరి నూనె సహకరిస్తుంది. ఇది జీవక్రియను పెంపొందించడంతో పాటు థైరాయిడ్, ఎండోక్రైన్ గ్రంధులు సక్రమంగా పనిచేయడానికి దోహదం చేస్తుంది. కొబ్బరి నూనె జీర్ణక్రియకు తోడ్పడటమే కాకుండా, పేగుల సమస్య నుంచి రక్షిస్తుంది. అజీర్ణం కలిగించే వివిధ బ్యాక్టీరియాలు, ఫంగస్‌ల‌తో పోరాడుతుంది. అలాగు కొబ్బరి నూనె చిన్నపిల్లలకు రాస్తే వారి సున్నితమైన చర్మాన్ని ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: