పై ఫొటోలో కనిపిస్తున్న నలుగురు యువతులు ట్విన్స్. కేరళ రాష్ట్రానికి చెందిన రెమాదేవి అనే మహిళకు 1995 నవంబర్ 18న ఒకే కాన్పులో ఒక్క అబ్బాయి, నలుగురు అమ్మాయిలు జన్మించారు. కానీ వారు అతి తక్కువ బరువుతో జన్మించి.. అనేక ఆరోగ్య సమస్యలకు గురయ్యారు. దాంతో తల్లిదండ్రులుకి అనేక ఆర్థిక సమస్యలు ఎదురయ్యాయి. దాదాపు తొమ్మిదేళ్ల పాటు శ్రమించిన తండ్రి వారిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఆ తర్వాత బాగా పెరుగుతున్న ఆర్థిక సమస్యలతో తాళలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఆపై కుటుంబ బరువు, బాధ్యతలంతా తల్లి రెమాదేవి పై పడ్డాయి. ఈ క్రమంలోనే ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన రెమాదేవికి ఎన్నో కష్టాలు అంటూ వార్తా పత్రికలలో విస్తృతంగా కథనాలు వచ్చాయి. తద్వారా వీరి దీనస్థితిని గుర్తించిన కేరళ రాష్ట్ర ప్రభుత్వం రెమాదేవికి ప్రభుత్వ బ్యాంకు లో ఉద్యోగం ఇప్పించింది. దాంతో ఆర్థికపరంగా వారు కాస్త ఉపశమనం చెందారు.


ఇక ఈ నలుగురు కవలల విషయానికి వస్తే... ఏ పని చేసినా ఒకేసారి చేస్తారు.. ఒకే విధంగా చేస్తారు. డ్రెస్ వేసుకున్నా అందరూ ఒకే కలర్ డ్రెస్ వేసుకుంటారు... ఒకే స్కూల్... ఒకే క్లాస్్, ఒకే బెంచ్.. ఓకే వరస లో కూర్చోవడం.. ఇలా అన్నీ ఒకే విధంగా, ఒకే సారి చేస్తూ ఉండేవారు. చివరకి వారి వివాహములు, హనీమూన్ లను కూడా ఒకేసారి చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నలుగురు చేసుకోబోయేది మాత్రం ఒక్కన్నే కాదు... ఒక్కొక్కరు నలుగురు వేరు వేరు వ్యక్తులని.


ఇక వారి పేర్ల విషయానికి వస్తే... ఉత్రా, ఉత్రజా, ఉతరా, ఉతమా. సోదరుడిి పేరు ఉత్రాజన్. ప్రస్తుతం వీరందరూ తమ గ్రాడ్యుయేట్ చదువులను పూర్తి చేసుకున్నారు. 2019 సెప్టెంబర్ నెలలో వీరి నిశ్చితార్థం జరిగింది. 2020 ఏప్రిల్ 26 న గురువాయూర్ లోని శ్రీ కృష్ణ దేవాలయంలో వివాహాలు చేసుకోనున్నారు. నలుగురి పెళ్లిళ్లు ఒకేసారి జరుగుతుండటంతో... వివాహానికి సంబంధించిన అనేక కార్యక్రమాలను ఇప్పటి నుంచే అరెంజ్ చేసుకుంటున్నారు. "ఇప్పుడు మా ఇంటి దగ్గర చర్చ అంతా మా పెళ్లి గురించే. మేము ఇంకా పెళ్లి చీరలు కొనాల్సి ఉంది. అందరమూ ఒకే డిజైన్, ఒకే రంగు బట్టలు తీసుకుంటాం’’ అని ఉతరా చెప్పారు. మాలో ఒకరిద్దరికి పెళ్లి సంబంధాలు ముందే వచ్చాయి. కానీ, మేమంతా ఒకే రోజు పెళ్లి చేసుకోవాలనేది మా అమ్మ కోరిక. దాంతో అందరికీ సంబంధాలు దొరికే వరకూ వేచిచూశాం’’ అని ఉత్రజా  చెప్పారు. నలుగురు కూతుర్ల పెళ్లిళ్లు ఒకేసారి జరుగుతుండడంతో తల్లి రెమా దేవి చాలా సంతోష పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: