కివీ పండ్లు... ప్రస్తుతం చాల మందికి తెలిసిన, అందుబాటులో ఉన్న పండ్లు. ఇవి ఎందుకు తినాలి, ఒక వేళ తింటే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం. ​ముందుగా ఈ పండు అందానికి ఎలా ఉపయోగ పడుతుందో ఇప్పుడు చూద్దాం. ప్రతీ ఒక్కరికీ అందంగా, యవ్వనంగా కనిపించాలని ఉంటుంది. అందుకోసం చాలానే ఖర్చు పెడతారు. ఏవేవో ప్రయత్నాలు చాల చాల చేస్తారు. బ్యూటీ పార్లర్స్ చుట్టూ తిరిగుతుంటారు.

 

 

ఇలాంటివన్నీ పై పై హంగులు మాత్రమే, అందం అనేది లోపలి నుంచి కొన్ని పోషకాలు తీసుకుంటే నేచురల్‌గా అందంగా కనిపించడం ముఖ్యం. అది ఎప్పటికీ శాశ్వతంగా కూడా ఉంటుంది. అందుకోసం కివీ పండ్లు తీసుకోండి అని  నిపుణులు కూడా చెబుతున్నారు. కివీలో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్, విటమిన్ సి లు సమృద్ధిగా లభిస్తాయి. నారింజ, బత్తాయి, నిమ్మకంటే ఇందులోనే విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది చర్మానికి కావాల్సిన పోషకాలన్నింటినీ కలిపిస్తుంది. దీని వల్ల స్కిన్ తాజాగా, అందంగా కనపడుతుంది.

 

ఇక ఆరోగ్య పరంగా కూడా ఈ పండుని తినొచ్చు. ​గుండె సమస్యలున్నవారికి ఇది చాలా మంచిది. ఇందులో ఆపిల్‌ లో కంటే 5 రెట్లు ఎక్కువ పోషకాలు ఇందులో లభిస్తాయి. ఇందులో కొవ్వు, సోడియం తక్కువగా ఉంటాయి. అందువల్ల షుగర్ వ్యాధిగ్రస్తులు, గుండె సమస్యలు ఉన్నవారు కూడా ఈ పండుని హ్యాపీగా తీసుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. వీటిని తినడం వల్ల ఆరోగ్య, అందం పరంగా అన్ని విధాలుగా ఇది చాలా ఉపయోగపడుతుంది అని చెబుతున్నారు వైద్యులు.

 

ఇంకా ఈ కివీతో ​కంటి సమస్యలు దూరం చేసుకోవచ్చు. పీచు పదార్థం, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ వంటి ఎన్నో పోషకాలు ఇందులో చాలా అధికంగా ఉంటాయి. దీనితో వీటిని తినడం వల్ల ఎన్నో సమస్యలు దూరం చేసుకోవచ్చు. వీటిని రెగ్యులర్‌ గా వీటిని తినడం ద్వారా కంటి సమస్యలు కూడా దూరం అవుతాయని అంటున్నారు నిపుణులు. ఇంకెందుకు ఆలస్యం కివీని తిని ఆరోగ్యాన్ని, అందాన్ని పెంచుకోండి. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: