హస్తప్రయోగంపై అందరికీ చాలా అపోహలుంటాయి. రోజూ హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటే అంగస్తంభన సమస్యలతో పాటు పురుషాంగం వంకరంగా మారుతుందని కొందరి అపోహ. అలాగే చాలా రకాల అనారోగ్యాలకు గురవుతామని కొందరు నమ్ముతారు. చాలా మందికి రోజూ హస్త ప్రయోగం చేసుకోవడం అలవాటుగా ఉండొచ్చు. అయితే రోజూ అలా వీర్యాన్ని స్కలిస్తే ఏమవుతుందనే విషయంపై చాలా మందికి చాలా రకాలు అనుమానాలు, అపోహలు ఉంటాయి. హస్త ప్రయోగం చేసుకోవడం తప్పేమీ కాదు.

 

ఎక్కువగా యువత రోజూ హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటారు. 14 నుంచి17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారిలో సుమారు 74% మంది అబ్బాయి, 48% అమ్మాయిలు ప్రతి రోజూ హస్తప్రయోగం చేసుకుంటున్నారని కొన్ని పరిశోధనల్లో తేలింది. అలాగే 57 నుంచి 64 సంవత్సరాల మధ్య ఉన్నవారిలో 63% పురుషులు, 32% మంది మహిళలు రోజూ హస్తప్రయోగం చేసుకుంటున్నారని కొన్ని సర్వేల్లో తేలింది. . కొందరు సెక్స్ లో పాల్గొంటున్నా కూడా అందులో సరైన సంత్రుప్తి దక్కకపోవడం వల్ల హస్త ప్రయోగం చేసుకుంటారు.

 

అలాగే ఎక్కువగా హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటే వీర్యం తగ్గిపోతుందని కొందరు అనుకుంటూ ఉంటారు. వంధ్యత్వం కూడా వచ్చే అవకాశం ఉంది అనుకుంటూ ఉంటారు. అలాగే ఆడవారు కూడా తాము రోజూ హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటే చాలా ఇబ్బందులకు గురవుతామని భయపడుతుంటారు. రోజు హస్త ప్రయోగం చేసుకుంటే బాగా సంతృప్తి చెందడంతో పాటు చాలా రకాల ప్రయోజనాలు పొందుతారు. ప్రోస్టేట్ క్యాన్సర్ బారిన పడే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఇక ఆడవారు రోజూ హస్త ప్రయోగం చేసుకుంటూ ఉంటే యోనికి సంబంధించి చాలా సమస్యలు తగ్గిపోతాయి.

 

రోజూ హస్తప్రయోగం చేసుకునే అమ్మాయిలకు సెక్స్ సమయంలో పెద్దగా నొప్పి ఉండదు. హస్తప్రయోగం చేసుకుంటే ఒత్తిడి తగ్గుతుంది. ఆందోళనలు తగ్గుతాయి. అలాగే అమ్మాయిలకు యోని పొడిగా ఉండకుండా ద్రవాలు ఊరుతాయి. హస్త ప్రయోగం చేసుకునేటప్పుడు ఒత్తిడికి గురి కాకుండా ప్రశాంతంగా చేసుకోండి. అలాగే చేసుకుంటే మానసికంగా మీరు ఎలాంటి సమస్యలకు గురికాకుండా ఉంటారు. అయితే ఏదైనా సరే లిమిట్ దాటకుండా ఉండాలి. మితిమీరిన హస్తప్రయోగం కూడా మంచిది కాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: