గద్దలు సాధారణంగా తమ ఆహార అన్వేషణలో కూసింత వెరైటీ టెక్నీక్‌ను అవలంబిస్తుంటాయి. ఆకాశంలో విహరిస్తూనే నేలపై, నీటిలోని చిన్న చిన్న జీవులపై ఫోకస్ పెడుతుంటాయి. అనంతరం అదను చూసి ఒక్కసారిగా కిందకు వచ్చి వాటిని నోట కరచుకొని వెళ్లిపోతుంటాయి. కానీ.. ఓ గ‌ద్ద‌ను మాత్రం ఆక్టోప‌స్ గ‌డ‌గ‌డ‌లాడించేసింది. నీటిలో ఉన్న ఆక్టోపస్‌ కోసం కిందకు వచ్చిన గద్దకు వింత అనుభవం ఎదురైంది. వివ‌రాల్లోకి వెళ్తే.. కెనెడాలోని వాంకోవర్‌ ఐలాండ్‌లో ఆహారం కోసం నీటిలో అన్వేషిస్తోన్న ఓ గద్దను  ఆక్టోపస్‌ వచ్చి గద్దను తన కబంద హస్తాలలో బంధించి ఉక్కిరిబిక్కిరి చేసింది. 

 

దానికి చిక్కిన గద్ద విలవిల్లాడిపోయింది.. విడిపించుకోలేపోయింది. సరిగ్గా అదే సమయానికి చేపలను పెంచే సాల్మన్‌ బృందం పడవలో వెళ్తూ గద్ద అరుపులు విని అక్కడికి చేరుకున్నారు. అప్పటికే ఆక్టోపస్‌ హస్తాలలో చిక్కుకున్న గద్ద బయటికి వచ్చేందుకు చేస్తున్న పోరాటాన్ని ఆ బృందం గమనించింది.  బాధతో అది చేస్తోన్న చప్పుడును విన్న ఓ వ్యక్తి ఆక్టోపస్‌ బారి నుంచి గద్దను రక్షించాడు. ఒక కర్ర సాయంతో ఆక్టోపస్‌ను కదిలించి, గద్దను దాని నుంచి వదిలించే ప్రయత్నం చేశాడు. చివరకు గద్దను ఆక్టోపస్‌  విడిచింది. నిజానికి అది అలాగే ఇంకాసేపు తొండాలను గట్టిగా చుట్టేస్తే గద్ద ఊపిరి ఆగిపోయి దానికి చికెన్ పీస్ అయిపోయేది. 

 

కానీ, దాని అదృష్టం బాగుండి ప్రాణాల‌తో బ‌య‌ట‌ప‌డింది. ఇక ఆక్టోప‌స్ విడిచిన వెంట‌నే.. గద్ద గాల్లోకి తుర్రున ఎగిరిపోయింది. ఇందుకు సంబంధించి దృశ్యాలను మత్స్యకారులు కొందరు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు. కేవ‌లం మొత్తం 54 సెకెన్ల నిడివి ఉన్న ఈ వీడియోనూ కాస్తా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.  ఇక‌ యూట్యూబ్‌లో ఈ వీడియోను రెండున్నర 1.78 మిలియన్ల మంది చూడ‌డం విశేషం. మ‌రోవైపు గద్దను కాపాడిన వారిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: