టమోటా ఎగ్ కర్రీ.. ఎందుకు తినలేదు చాల సార్లు తిన్నాం. మా అమ్మ చాల సార్లు చేసి పెట్టింది అని అనుకుంటారు. కానీ ఇక్కడ చెప్పే  టమోటా ఎగ్ కర్రీ ఎవరు తిని ఉండరు. ఎందుకంటే టమోటా ఎగ్ కర్రీ అంత రుచిగా ఉంటుంది కాబట్టి. అయితే ఎంతో రుచికరమైన ఈ టమోట ఎగ్ కర్రీ ఎలా చేయాలో ఇక్కడ చదివి తెలుసుకోండి.

                             

కావలసిన పదార్థాలు.. 

                                

గుడ్లు - 3, 

 

టమోటా ప్యూరీ రెండు కప్పులు, 

 

నూనె - 1 టేబుల్‌ స్పూను, 

 

కసూరీ మేతీ - 1 టీ స్పూను, 

 

ఎండుమిర్చి తరుగు - అర టీ స్పూను, 

 

పనీర్‌ తురుము - పావు కప్పు, 

 

కొత్తిమీర - 1 కట్ట, 

 

బరకగా దంచిన మిరియాలు - అర టీ స్పూను, 

 

ఉప్పు - రుచికి తగినంత.

 

తయారీ విధానం...

 

కడాయిలో టమోటా ప్యూరీ, చిటికెడు ఉప్పు, ఎండుమిర్చి తరుగు, దంచిన మిరియాలు, కసూరీ మేతీ కలిపి స్టౌవ్‌ మీద పెట్టి, పెద్దమంటలో ఉంచి మరగడం మొదలవగానే మంట బాగా తగ్గించి మిగతా ఉప్పు కలపాలి. రెండు నిమిషాల తర్వాత గుడ్లని పగలగొట్టి విడివిడిగా వేసి మూత పెట్టాలి. పది నిమిషాల తర్వాత అర టీ స్పూను ఆలివ్‌ ఆయిల్‌తో పాటు చిటికెడు మిరియాల పొడి, కొత్తిమీర తరుగు చల్లి దించేయాలి. అంతే టమోటా ఎగ్ కర్రీ రెడీ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: